Mayor Anuradha
-
మేయర్ హత్య కేసులో చార్జ్‌షీట్ దాఖలు
- 23 మంది నిందితులు.. 130 మంది సాక్షులు - 4 పిస్తోళ్లు, 8 వాహనాలు, 3 కత్తులు సీజ్ చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో నేర అభియోగ పత్రం (చార్జ్‌షీట్) దాఖలైంది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న చిత్తూరు డీఎస్పీ ఎం.లక్ష్మినాయుడు శుక్రవారం స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో న్యాయమూర్తి యుగంధర్‌కు చార్జ్‌షీట్‌ను సమర్పించారు. గత ఏడాది నవంబర్ 17న చిత్తూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనురాధను తుపాకీతో కాల్చడంతో పాటు ఆమె భర్త కటారి మోహన్‌ను కత్తులతో దాడిచేయడంతో వారు మృతి చెందారు. దాడి జరిగిన రోజు ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. నవంబరు 21న వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 90 రోజుల్లో వారిపై మోపిన అభియోగాలకు సంబంధించి దర్యాప్తు అధికారి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో నిందితులకు స్వచ్ఛందంగా బెయిలు మంజూరు చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. 90 రోజుల గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చార్జ్‌షీటులో ఏముందంటే.. మేయర్ అనురాధ, మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటా చలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగన్, వెంకట యోగానంద్, పరంధామ, మొగిలి, శశిధర్, ఎంఎస్.యోగానంద్, ఆర్వీటి బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకట ఆనంద్‌కుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్రబాబు, శ్రీనివాస ఆచారి, కాసారం రమేష్, బుల్లెట్ సురేష్ అనే 23 మంది నిందితులుగా ఉన్నారు. నిందితులపై ఐపీసీ 147, 148, 302, 307, 120 (బీ ఆర్డబ్ల్యూ) 149, సెక్షన్ 25 (1బీ) ఏ, 25 (1) (ఏఏఏ), 27 మారణాయుధాల నిరోధక చట్టం సెక్షన్ 212, 216 కింద (క్రైమ్ నెం.130/2105) కేసు నమోదు చేశారు. హత్య జరిగిన తరువాత ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, మేయర్ దంపతుల మరణాన్ని ధ్రువీకరించిన వైద్యులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నిపుణులు ఇచ్చిన నివేదికలతోపాటు దర్యాప్తు అధికారి మొత్తం 130 మందిని సాక్షులుగా చేర్చారు. ఈ ఘటనలో నిందితుల నుంచి నాలుగు పిస్తోళ్లు, 8 వాహనాలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో నిందితుల పాత్ర, మృతులతో వీరికి ఉన్న కక్షలు, సంబంధాలపై సవివరంగా పేర్కొన్నారు. ఈ కేసులో ఆర్వీటి బాబు, కాసారం రమేష్, వెంకట ఆనంద్‌కుమార్ బెయిల్‌పై విడుదలయ్యారు. మిగిలిన 20 మంది రిమాండు ఖైదీలుగా పలు జైళ్లలో ఉన్నారు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. -
మేయర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
-
చింటూ డ్రైవర్ అరెస్ట్
చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. చింటూ డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకటేష్ ఈ కేసులో మూడవ నిందితుడిగా ఉన్నాడు. ఈ రోజు ఉదయం వెంకటేష్ ను చిత్తూరు కోర్టు ఆవరణలో పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో లొంగిపోవడానికి వెంకటేష్ వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. కాగా మరో నిందితుడు మొగిలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నోరువిప్పుతున్న చింటూ?
పెరగనున్న నిందితుల సంఖ్య ఇప్పటికే పోలీసుల అదుపులో ఎనిమిది మంది హత్య కుట్ర తెలిసిన వారిపై కేసులు షురూ బయటపడుతున్న పెద్దల భాగోతం మేయర్ దంపతుల హత్య కేసు చిత్తూరు (అర్బన్): మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో చింటూ పోలీసుల ఎదుట నోరు విప్పుతున్నాడా..? హత్య కుట్రలో ఎవరెవరు ఉన్నారు..? ఎవరికి ముందే తెలుసు..? అనే వివరాలు చెబుతున్నాడా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీసుల కస్టడీలో ఉన్న చింటూ మేయర్ హత్య ఘటనపై పలు విషయాలు పూసగుచ్చినట్లు చెప్పినట్టు సమాచారం. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఎనిమిది మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారికి హత్య కుట్రలో ఏ మేరకు సంబంధాలున్నాయనే విషయం నిర్ధారించుకున్న తర్వాత కేసులు నమోదు చేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. పెరగనున్న నిందితుల సంఖ్య... గత నెల 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మేయర్ దంపతుల జంట హత్య కేసులో పోలీసులు ప్రాథమికంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడిగా చింటూ, ఇతర నిందితులుగా వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, హరిదాస్, మొగిలి, శశిధర్ ఉన్నారు. మొగిలి, వెంకటేష్‌ను ఇంకా అరెస్టు చేయలేదు. చింటూ చెబుతున్న విషయాల ఆధారంగా నిందితుల సంఖ్య పెరగనుందని కేసును విచారిస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అందరినీ అరెస్టు చేయబోమని, హత్య కుట్రలో పాలు పంచుకున్నవారు, కుట్ర విషయం ముందుగానే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వని వారు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని సాక్ష్యాలు సేకరిస్తామని, అనంతరం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు చింటూను 15 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బుధవారం ఇతన్ని చిత్తూరు నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. కస్టడీ గడువు పూర్తయ్యేంత వరకు ఇతన్ని తమ వద్దే ఉంచుకుని తరువాత కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన తొమ్మిది మంది నిందితులను విచారించిన తరువాత సజ్ జైలులో, జిల్లా జైలులో ఉంచాలి. వీళ్లందరినీ ఒకే చోట ఉంచినా ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.