
చింటూ రిమాండు పొడిగింపు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ రిమాండు గడువును పొడిగిస్తూ స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం చింటూతో పాటు మేయర్ హత్య కేసులో ఉన్న నిందితులను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరచారు.
ఈ కేసులో నిందితుడిగా ఉంటూ బెయిల్‌పై ఉన్న కాసారం రమేష్ జిల్లాలోకి ప్రవేశించ కూడదని షరతు ఉండటంతో ఇతను కోర్టుకు రాలేదు. మిగిలిన నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరవగా, తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు.