Rimand
-
రిమాండ్ ఖైదీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ
టెక్కలి: వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలికి చెందిన మాదిన వల్లభరావు పాతపట్నం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతి చెందిన ఘటనకు సంబంధించి మంగళవారం టెక్కలి ఆర్డీఓ బి.దయానిధి కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. వల్లభరావు పాతపట్నం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ గత ఏడాది నవంబర్‌లో శ్రీకాకుళం రిమ్స్‌లో మృతి చెందాడు. ఈయన మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య లక్ష్మి, తమ్ముడు లక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. దీంతో శ్రీకాకుళం ఆర్డీఓ సమక్షంలో సబ్ జైలు సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసరావు, వార్డెన్లు ఎం.అప్పారావు, పి.రామారావుతో పాటు మెళియాపుట్టి పోలీస్ సిబ్బంది ఎం.ఉమామహేశ్వరరావులను విచారించి వివరాలు సేకరించారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయంలో తదుపరి విచారణ ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. -
వరంగల్ కోర్టులో బెంగాల్ యువకుడి రిమాండ్
వరంగల్ లీగల్ : బాలికను కిడ్నాప్ చేసి పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో నివసిస్తున్న పశ్చిమబెంగాల్ యువకుడిని ఇక్కడి పోలీసుల సాయం తో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లా గోల్‌బరీ గ్రామానికి చెందిన దేబశీష్‌రాయ్(19) మరో ఇద్దరు కలిసి 2016 జూలై 14న అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ను కిడ్నాప్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నాడియా జిల్లా కృష్ణానగర్ మహిళా పోలీస్స్టేన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాలికతో సహ నిందితుడు దేబశీష్‌రాయ్ పరారీలో ఉన్నాడు. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో అతడు బాలికతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు బెంగాల్ పోలీసులకు సమాచారమందింది. దీంతో కల్లెడకు చేరుకొని పర్వతగిరి పోలీసుల సాయంతో శుక్రవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కృష్ణానగర్ మహిళా పోలీస్‌స్టే ఏఎస్సై సుజాతసింగ్‌రాయ్ కోర్టుకు తెలిపారు. చట్టప్రకారం 24 గంటల్లో సంబంధిత నాడియా జిల్లా కృష్ణానగర్‌లోగల అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిసే్ట్రట్ సదార్ కోర్టులో హజరుపరచలేనందు వల్ల అందుబాటులోఉన్న మూడో ము న్సిఫ్ మెజిసే్ట్రట్ కోర్టులో హజరుపరుసున్నామని 4 రోజుల్లో సంబంధిత కోర్టులో హాజరుపర్చడానికి అనుమతి ఇవ్వాలని ఏఎస్సై కోరారు. రిమాండ్ స్వీకరించిన కోర్టు అనుమతి ఇస్తూ జడ్జి అజేష్‌కుమార్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు. -
చింటూ రిమాండు పొడిగింపు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ రిమాండు గడువును పొడిగిస్తూ స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం చింటూతో పాటు మేయర్ హత్య కేసులో ఉన్న నిందితులను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరచారు. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ బెయిల్‌పై ఉన్న కాసారం రమేష్ జిల్లాలోకి ప్రవేశించ కూడదని షరతు ఉండటంతో ఇతను కోర్టుకు రాలేదు. మిగిలిన నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరవగా, తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు.