వరంగల్ కోర్టులో బెంగాల్ యువకుడి రిమాండ్
Published Sat, Sep 17 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
వరంగల్ లీగల్ : బాలికను కిడ్నాప్ చేసి పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో నివసిస్తున్న పశ్చిమబెంగాల్ యువకుడిని ఇక్కడి పోలీసుల సాయం తో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లా గోల్‌బరీ గ్రామానికి చెందిన దేబశీష్‌రాయ్(19) మరో ఇద్దరు కలిసి 2016 జూలై 14న అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ను కిడ్నాప్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నాడియా జిల్లా కృష్ణానగర్ మహిళా పోలీస్‌స్టేన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాలికతో సహ నిందితుడు దేబశీష్‌రాయ్ పరారీలో ఉన్నాడు. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో అతడు బాలికతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు బెంగాల్ పోలీసులకు సమాచారమందింది. దీంతో కల్లెడకు చేరుకొని పర్వతగిరి పోలీసుల సాయంతో శుక్రవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కృష్ణానగర్ మహిళా పోలీస్‌స్టే ఏఎస్సై సుజాతసింగ్‌రాయ్ కోర్టుకు తెలిపారు. చట్టప్రకారం 24 గంటల్లో సంబంధిత నాడియా జిల్లా కృష్ణానగర్‌లోగల అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిసే్ట్రట్ సదార్ కోర్టులో హజరుపరచలేనందు వల్ల అందుబాటులోఉన్న మూడో ము న్సిఫ్ మెజిసే్ట్రట్ కోర్టులో హజరుపరుసున్నామని 4 రోజుల్లో సంబంధిత కోర్టులో హాజరుపర్చడానికి అనుమతి ఇవ్వాలని ఏఎస్సై కోరారు. రిమాండ్ స్వీకరించిన కోర్టు అనుమతి ఇస్తూ జడ్జి అజేష్‌కుమార్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు.
Advertisement