గత నెల 17వ తేదీన జరిగిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టుచేశారు. ఎస్పీ శ్రీనివాస్ సోమవారం అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు తుపాకీ, బుల్లెట్లు ఇచ్చారనే ఆరోపణలపై చిత్తూరుకు చెందిన రజనీకాంత్ (35), నరేంద్రబాబు అలియాస్ పకోడి (42), కర్ణాటకలోని చింతామణి చెందిన శ్రీనివాస ఆచారి (72)ని అరెస్టు చేశారు.
చింటూ నేరం చేశాడని తెలిసీ బెంగళూరులో ఆశ్రయం కల్పించడంతోపాటు వాహనాలు సమకూర్చినందుకు కమలాకర్ (44) అనే వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. వీరి నుంచి చింటూ పారిపోతూ కారులో పడేసిన 0.22 ఎంఎం పిస్టోలు, 16 బుల్లెట్లు, హత్యానంతరం పారిపోయిన స్విఫ్ట్ కారు, బెంగళూరులో తిరిగిన డస్టర్ కారును స్వాధీనం చేసుకున్నారు.
దీంతో మేయర్ జంట హత్యల కేసులో అరెస్టుల సంఖ్య 22కు చేరింది. వీరితో పాటు మరి కొందరిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు
Published Mon, Dec 7 2015 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
Advertisement