mayor murder case
-
మేయర్ దంపతుల హత్య కేసు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసు విచారణ (ట్రయల్ షెడ్యూల్) తేదీలను ఖరారు చేస్తూ స్థానిక 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కబర్ది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 నవంబరులో జరిగిన జంట హత్యల కేసులో చింటూతో పాటు వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, మొగిలి, హరిదాస్, శశిధర్, ఎంఎస్.యోగానంద్, ఆర్వీటీ బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకటానంద్, కమలాకర్, రజనీకాంత్, నాగేంద్ర, శ్రీనివాసాచారి, బుల్లెట్ సురేష్ నిందితులుగా ఉన్నారు. వీరిలో వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్‌కు బెయిల్ రాలేదు. కేసు విచారణను వేగవంతం చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో చిత్తూరు కోర్టు చర్యలు చేపట్టింది. కేసులో మొత్తం 130 మంది సాక్షులుగా ఉన్నారు. వీరిలో 69 మందిని తొలుత విచారించనున్నారు. ఈ నెల 29 నుంచి ఈ ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు తొలి షెడ్యూల్ విచారణ జరగనుంది. మలి షెడ్యూల్‌ను ప్రకటించి విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించనున్నారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడంతో చింటూను పోలీసులు వైఎస్సార్ కడప జైలుకు తరలించారు. -
మేయర్ హత్యకేసులో ఇద్దరి కోసం గాలింపు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ హత్య కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 23 మందికి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. 21 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న ఆర్వేటి బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరో నిందితుడు సురేష్ టీడీపీకు చెందిన ఓ ఎమ్మెల్యే నుంచి పోలీసులకు ఫోన్ చేయించగా.. ఇందులో కల్పించుకోవద్దని పోలీసులు సైతం గట్టిగానే చెప్పినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు చింటూకు తుపాకిని సమకూర్చాడనే ఆరోపణపై సురేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తుపాకీ కటారి మోహన్, చింటూలు ఒక్కటిగా కలిసి ఉన్నప్పుడు సురేష్ వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. మామఅల్లుళ్ల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కాసిరాళ్ల బాబు ద్వారా తుపాకిని సురేష్ నుంచి చింటూ తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు
-
మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు
గత నెల 17వ తేదీన జరిగిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టుచేశారు. ఎస్పీ శ్రీనివాస్ సోమవారం అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు తుపాకీ, బుల్లెట్లు ఇచ్చారనే ఆరోపణలపై చిత్తూరుకు చెందిన రజనీకాంత్ (35), నరేంద్రబాబు అలియాస్ పకోడి (42), కర్ణాటకలోని చింతామణి చెందిన శ్రీనివాస ఆచారి (72)ని అరెస్టు చేశారు. చింటూ నేరం చేశాడని తెలిసీ బెంగళూరులో ఆశ్రయం కల్పించడంతోపాటు వాహనాలు సమకూర్చినందుకు కమలాకర్ (44) అనే వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. వీరి నుంచి చింటూ పారిపోతూ కారులో పడేసిన 0.22 ఎంఎం పిస్టోలు, 16 బుల్లెట్లు, హత్యానంతరం పారిపోయిన స్విఫ్ట్ కారు, బెంగళూరులో తిరిగిన డస్టర్ కారును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మేయర్ జంట హత్యల కేసులో అరెస్టుల సంఖ్య 22కు చేరింది. వీరితో పాటు మరి కొందరిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.