చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ హత్య కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 23 మందికి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. 21 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న ఆర్వేటి బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
మరో నిందితుడు సురేష్ టీడీపీకు చెందిన ఓ ఎమ్మెల్యే నుంచి పోలీసులకు ఫోన్ చేయించగా.. ఇందులో కల్పించుకోవద్దని పోలీసులు సైతం గట్టిగానే చెప్పినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు చింటూకు తుపాకిని సమకూర్చాడనే ఆరోపణపై సురేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తుపాకీ కటారి మోహన్, చింటూలు ఒక్కటిగా కలిసి ఉన్నప్పుడు సురేష్ వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. మామఅల్లుళ్ల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కాసిరాళ్ల బాబు ద్వారా తుపాకిని సురేష్ నుంచి చింటూ తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
మేయర్ హత్యకేసులో ఇద్దరి కోసం గాలింపు
Published Mon, Jan 4 2016 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM
Advertisement
Advertisement