
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రెండు రోజుల క్రితం కలకలం రేపిన ఐసీస్ ముఠా నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీన చేసుకున్నారు. ఐఎస్‌ఐఎస్ సంస్థతో సంబంధాలున్న మహ్మద్ ముస్తాకీమ్ అలీయాస్ అబూ యూసఫ్‌ను శుక్రవారం రాత్రి ఢిల్లీ నడి వీధుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో యూసఫ్ ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, అత్మాహుతికి పాల్పడే బాడీ జాకెట్లను పోలీసులు గుర్తించారు. ఇవ్వనీ ఉత్తర ప్రదేశ్‌లోని బలంపూర్ సమీపంలోని ఓ నివాసంలో గుర్తించిన పోలీసులు వాటి చూసి షాక్‌కు గురయ్యారు. (ఉగ్ర అలజడి : హై అలర్ట్)
వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృంధం మరికొన్ని ఆధారాలను సేకరిస్తోంది. యూసఫ్‌తో పాటు ఇంకా ఎవరైనా పేలుళ్లకు ప్రయత్నిస్తున్నారా..? ఏయే ప్రాంతాలు వారి టార్గెట్‌లో ఉన్నాయన్న అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు యూపీలో భారీగా పేలుడు పదర్ధాలు లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీతో సహా దేశంలోని ముఖ్య పట్టణాల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment