ISIS terrorist
-
హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ.. యువతను ‘ఉగ్ర’బాట పట్టించడంలో దిట్ట.. పరారీలో ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన రిజ్వాన్‌ను.. గత శుక్రవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి ఫరీదాబాద్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించినప్పుడు బయటికొచి్చన రెండు అంశాలు కలకలం రేపుతున్నాయి.రిజ్వాన్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో తలదాచుకున్నాడనేది ఒకటైతే.. సుదీర్ఘకాలం నుంచి పరారీలో ఉన్న గజ ఉగ్రవాది, హైదరాబాద్‌కే చెందిన ఫర్హాతుల్లా ఘోరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడనేది రెండో అంశం. రాష్ట్ర నిఘా విభాగానికి చెంప పెట్టులాంటి ఈ రెండు అంశాలు తెలిసిన వెంటనే ఇక్కడి నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ వెళ్లింది.6 నెలలు హైదరాబాద్‌లోనే..ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015–16లో ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐసిస్ బాటపట్టాడు. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో స్థిరపడిన షానవాజ్‌తో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఐసిస్ మాడ్యూల్ విస్తరణతోపాటు నిధుల సమీకరణకు పనిచేశాడు. చాలా మంది యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్షించి ఉగ్రవాద బాటపట్టించాడు. 2023 జూన్‌లో పుణే అధికారులు షానవాజ్ నేతృత్వంలోని ఈ మాడ్యూల్ గుట్టురట్టు చేసి.. పలువురిని అరెస్టు చేశారు.దీంతో రిజ్వాన్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతడిని మోస్ట్ వాంటెడ్‌గా గుర్తించిన ఎన్ఐఏ.. పట్టిస్తే రూ.3 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలను గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. సంభాల్‌లోని ఓ స్థావరంపై దాడి చేశారు. కానీ తృటిలో తప్పించుకున్న రిజ్వాన్.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. మారుపేరుతో సికింద్రాబాద్ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల పాటు నివసించాడు. తర్వాత కేరళ వెళ్లాడు. స్వాతంత్య్ర దిన వేడుకల నేపథ్యంలో విధ్వంసాలకు పథకం వేసి ఢిల్లీ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ–ఫరీదాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెల్ పోలీసులకు దొరికిపోయాడు. వారు అతడి నుంచి తుపాకీ, తూటాలు స్వా«దీనం చేసుకున్నారు.విచారణలో బయటపడిన కీలక అంశాలురిజ్వాన్ను విచారించిన సమయంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కీలక అంశాలను గుర్తించారు. హైదరాబాద్‌లోని కూర్మగూడ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీతో రిజ్వాన్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్టు తేల్చారు. ఘోరీ తాజా ఫొటోను సైతం రిజ్వాన్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడైన రిజ్వాన్ దేశంలోని వివిధ నగరాలను టార్గెట్‌గా చేసుకున్నట్టు గుర్తించారు. ఫర్హాతుల్లా ఘోరీతో సంప్రదింపులు, హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు ఉండటం నేపథ్యంలో.. ఘోరీ ద్వారానే ఇక్కడ ఆశ్రయం పొందినట్టు భావిస్తున్నారు. రిజ్వాన్‌ను విచారించేందుకు.. రిజ్వాన్‌ను విచారిస్తే హైదరాబాద్‌లో ఎవరి ద్వారా, ఎప్పుడు ఆశ్రయం పొందాడో, ఎవరెవరిని కలిశాడో తెలుస్తుందని.. ప్రస్తుతం ఘోరీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రిజ్వాన్‌ను విచారించడంతోపాటు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి సమాచారం తీసుకోవడం కోసం రాష్ట్రం నుంచి ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది.మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆరు నెలల పాటు నగరంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కదలికలను రాష్ట్ర నిఘా విభాగాలు కనిపెట్టలేకపోవడం వైఫల్యంగానే ఉన్నతాధికారులు పరిగణిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై లోతుగా అంతర్గత సమీక్ష చేపట్టినట్టు సమాచారం. -
ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
న్యూడిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ టెర్రరిస్ట్ మహమ్మద్ షానవాజ్ అలియాస్ సైఫీ ఉజామాతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింది. కాగా సైఫీ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లిస్ట్‌లో ఉన్నారు. అతని వివరాలు వెల్లడించిన వారికి మూడు లక్షల రివార్డు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అనుమానిత ఉగ్రవాదులు దేశ రాజధానిలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం రావడంతో ఇతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన షానవాజ్ పూణె ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇతడు ఢిల్లీకి చెందిన వాడు కాగా పూణె పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఢిల్లీలో తలదాచుకున్నట్లు తెలియడంతో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే ద్రవ రసాయనంతో సహా పలు పేలుడు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను ప్రస్తతం పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఐసిస్ ఉగ్రవాదుల గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా దేశంలోని అనేక టెర్రర్ మాడ్యూల్స్‌ను అణిచివేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ఐఏ అధికారులతో కలిసి పనిచేస్తోంది. షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులైన రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డయాపర్వాలా, తల్హా లియాకత్ ఖాన్ గురించి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతిని ఇటీవలె ఎన్ఐఏ ప్రకటించింది. మహారాష్ట్రలోని పూణెలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు చెందిన మాడ్యూల్తో ఈ నలుగురికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చదవండి: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత -
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐసిస్ కలకలం
-
హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఐపీ అడ్రస్ ద్వారా మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ ఫలక్‌నుమా పరిధిలోని రైతు బజార్లో కొంతకాలంగా నివాసముంటున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. కాగా 2020లోనే పహాడీషరీఫ్‌లో సులేమాన్‌కు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ తరువాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సులేమాన్ తరువాత ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సోషల్ మీడియా వేదికగా సులేమాన్ ఏకంగా 20 ఖాతాలను తెరిచి యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నాడని పోలీసులు తేల్చారు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలు మరోసారి తెరమీదకు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక లతో ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చదవండి: యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ -
ఆత్మాహుతి దాడికి యత్నం : హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రెండు రోజుల క్రితం కలకలం రేపిన ఐసీస్ ముఠా నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీన చేసుకున్నారు. ఐఎస్ఐఎస్ సంస్థతో సంబంధాలున్న మహ్మద్ ముస్తాకీమ్ అలీయాస్ అబూ యూసఫ్‌ను శుక్రవారం రాత్రి ఢిల్లీ నడి వీధుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో యూసఫ్ ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, అత్మాహుతికి పాల్పడే బాడీ జాకెట్లను పోలీసులు గుర్తించారు. ఇవ్వనీ ఉత్తర ప్రదేశ్‌లోని బలంపూర్ సమీపంలోని ఓ నివాసంలో గుర్తించిన పోలీసులు వాటి చూసి షాక్‌కు గురయ్యారు. (ఉగ్ర అలజడి : హై అలర్ట్) వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృంధం మరికొన్ని ఆధారాలను సేకరిస్తోంది. యూసఫ్‌తో పాటు ఇంకా ఎవరైనా పేలుళ్లకు ప్రయత్నిస్తున్నారా..? ఏయే ప్రాంతాలు వారి టార్గెట్‌లో ఉన్నాయన్న అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు యూపీలో భారీగా పేలుడు పదర్ధాలు లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీతో సహా దేశంలోని ముఖ్య పట్టణాల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది. -
వెలుగులోకి ఐసిస్ ఉగ్రవాది వ్యవహారాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐసిస్ విస్తరణకు భారీ కుట్ర పన్నిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ జమ్మూకశ్మీర్లోనూ తన నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాంతానికి చెందిన మరికొందరితో కలసి ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూకశ్మీర్ (జేకేఐఎస్) పేరుతో ఐసిస్‌కు అనుబంధ సంస్థను విస్తరించాలని ప్రయత్నాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెబుతున్నారు. దీనికోసం బాసిత్ గత ఏడాది ఆగస్టులో అరెస్టు కావడానికి ముందు అక్కడకు వెళ్లివచ్చాడని ఓ అధికారి పేర్కొన్నారు. కశ్మీర్‌కు చెందిన లోన్ అనే ఉగ్రవాది ఇతడికి షెల్టర్ ఇచ్చాడని బయటపడింది. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ ఢిల్లీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12న బాసిత్, ఖదీర్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లిన విషయం విదితమే. ఆది నుంచీ ఉగ్రభావాలతోనే... చంద్రాయణగుట్టలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ బీటెక్ రెండో సంవత్సరం వరకు చదివాడు. ఐసిస్‌లో చేరాలనే ఉద్దేశంతో 2014 ఆగస్టులో నోమన్, అబ్రార్, మాజ్‌తో కలసి బంగ్లాదేశ్ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు. కోల్‌కతాలో వీరిని పట్టుకున్న పోలీసులు నగరానికి తరలించి కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టారు. తరువాత కూడా వీరు ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లేందుకు యత్నించిన వీరిని 2015, డిసెంబర్ 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకొచ్చిన బాసిత్ విదేశాలతో పాటు ఢిల్లీ, కశ్మీర్‌ల్లో ఉన్న ఐసి స్ నాయకులతో సంబంధాలు కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది మరోసారి ఎన్ఐఏ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఇతడు తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వారి విచారణకు విరామం... బాసిత్ అరెస్టు కావడానికి ముందు అతడితో సంప్రదింపులు నెరపారని, పాతబస్తీలో సమావేశాలు నిర్వహించారనే ఆరోపణలపై షహీన్‌నగర్‌కు చెందిన జీషాన్, శాస్త్రీపురం వాసి మసూద్ తాహాజ్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షిబ్లీ బిలాల్‌ను ఎన్ఐఏ శనివారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ కార్యాలయంలో వీరిని 3రోజులు విచారించారు. మరోపక్క వార్దాలో ఉన్న బాసిత్ రెండో భార్య మోమిన్‌ను కూడా ఆమె ఇంటి వద్ద విచారించారు. ఈ ప్రక్రియకు మంగళవారం తాత్కాలిక విరామమిచ్చారు. వీరి నుంచి ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న 13 సెల్ఫోన్లు, 11 సిమ్‌కార్డులు, ఐపాడ్, ఎక్స్టెర్నల్ హార్డ్‌డిస్క్, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఎస్డీ కార్డులు, వాకీటాకీలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కశ్మీర్ ‘ప్రత్యేకం’ కావాలని.. జమ్మూకశ్మీర్‌ను ప్రాంతాన్ని ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఏర్పాటైందే జేకేఐఎస్. ఖురాసన్ మాడ్యూల్‌కు అనుబంధంగా ఇది పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. జేకేఐఎస్‌లో బాసిత్‌తో పాటు కశ్మీర్‌కు చెందినలోన్, ఉత్తరప్రదేశ్‌లోని గజ్‌రోలాకు చెందిన పర్వేజ్, జంషీద్ సహా మరో నలుగురు సభ్యులు మాత్రమే కీలకంగా వ్యవహరించారు. జేకేఐఎస్ విస్తరణ కోసం గత ఆగస్టు 1న కశ్మీర్‌కు వెళ్లి వచ్చిన తర్వాతే ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పర్వేజ్, జంషీద్‌ను అరెస్టు చేశారు. -
ఐసిస్ కలకలం
ఈ రాష్ట్రానికి ఏమైంది...ఒకవైపు మావోలు..మరోవైపు ఐఎస్ తీవ్రవాదులు..విధ్వంసాలకు కుట్ర’. నాలుగు రోజుల్లో పట్టుబడిన నిందితుల నేపథ్యం ప్రభుత్వాన్ని ప్రజలను ఈ రకంగాభయాందోళనకు గురి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పుడు తమిళనాడు దేశంలోనే శాంతి భద్రతల సమస్యలు, తీవ్రవాద కార్యకలాపాలు లేని ప్రాంతంగా పేరుగాంచింది. ఆధ్యాత్మిక చింతన, గుళ్లు గోపురాలతో నిండిన రాష్ట్రంలో కరుడుగట్టిన వ్యక్తులకు తావులేదని భావించేవారు. అయితే కొన్నేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తీవ్రవాద కార్యకలాపాలకు అవసరమైన మనుషులు తమిళనాడులో సులభంగా దొరుకుతారు అనే భావన జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు సైతం వేళ్లూనుకుపోయింది. యువతకు బ్రెయిన్ వాష్ చేసి ముఠాలో చేర్చుకోవడంలో కొందరు వ్యక్తులు నిమగ్నమై ఉండడం ఆందోళనకరమైన అంశం. దశరథన్, సెన్బగవళ్లి అనే మావో దంపతులు తమ దళంలోకి యువతను చేర్చుకునే ప్రయత్నంలోనే ఈనెల 10వ తేదీన తిరువళ్లూరులో పట్టుబడడం గమనార్హం. సుమారు 15 ఏళ్ల క్రితం అప్పటి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హతమార్చేందుకు తిరుమల అలిపిరి మార్గంలో మంతుపాతర పేల్చిన సంఘటనలో ఈ మావో దంపతులు నిందితులని పోలీసుల విచారణలో తేలింది. దీంతో సదరు మావోలు ఏపీపై గురిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. మావో దంపతులతో పాటు రహస్య సమావేశానికి హాజరై పారిపోయిన పదిమంది మావోల కోసం తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో క్యూ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ఐఎస్ కలకలం: మావోల కోసం ఒకవైపు కూంబింగ్ జరగుతుండగా చెన్నైలో సోమవారం రాత్రి ఐఎస్ తీవ్రవాది దొరకడం, మరో ఐదుగురి కోసం గాలించడం గమనార్హం. సిరియా, ఇరాక్‌లోని కొంత ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ తీవ్రవాదులు ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకోవాలని పోరాడుతున్నారు. ఐఎస్ తీవ్రవాదులకు, ఇతర దేశాల సైనికులకు మధ్య హోరాహోరీగా పోరుసాగుతోంది. ఈ పోరు కోసం మరింత బలగాలను సిద్ధం చేసుకునేందుకు ఐఎస్ తీవ్రవాద సంస్థ ఇతర దేశాలపై కన్నువేసింది. తమ తీవ్రవాద సంస్థకు ప్రపంచ నలుమూలలా సానుభూతిపరులు ఉన్నారని నమ్ముతున్న ఐఎస్ సంస్థ కేరళ నుంచి కొంత మంది యువకులను ఎంపిక చేసి సిరియాకు పంపి తమలో విలీనం చేసుకున్నట్లు కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గ్రహించారు. దీనిపై ఎన్ఐఏ తీవ్రస్థాయిలో విచారణ చేపట్టగా తమిళనాడు నుంచి సైతం యువత తరలిపోతున్నట్లు తెలియడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఐఎస్ తీవ్రవాదం వైపు యువతను చేరవేయడంలో కడలూరు జిల్లాకు చెందిన ఖాజా ఫక్రుద్దీన్ ప్రధానపాత్ర పోషించినట్లు కనుగొన్నారు. ఖాజా ఫక్రుద్దీన్ సిరియా దేశానికి వెళ్లి సాయుధ శిక్షణ కూడా తీసుకున్నాడు. సింగపూర్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఖాజా ఫక్రుద్దీన్ కదలికలపై అధికారులు నిఘాపెట్టారు. గత ఏడాది జనవరిలో అతని ఢిల్లీకి వచ్చినçప్పుడు ఎన్ఏఐకి పట్టుబడగా, తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేక తీవ్రవాద ముఠాను సిద్ధం చేసినట్లు, ఈ ముఠాలో 9 మంది తమిళులు ఉన్నట్లు అధికారుల వద్ద ఖాజా ఫక్రుద్దీన్ అంగీకరించాడు. ఈ 9 మందిపై 9 సెక్షన్లలో అనేక కేసులు పెట్టి గాలింపు ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన అబ్దుల్లా ముత్తలీఫ్, 18వ తేదీన సాహుల్ హమీద్ అనే ఐఎస్ సానుభూతిపరులు చెన్నైలో అరెస్టయ్యారు. ఈ ముగ్గురిని ఎన్ఏఐ అధికారులు తీవ్రస్థాయిలో విచారించారు. మిగిలిన ఆరుగురు అజ్ఞాతంలో ఉంటూ ఐఎస్ కోసం నిధుల సమీకరణ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఐఎస్ తీవ్రవాద సంస్థకు మానవరవాణా, నిధుల సమీకరణతోపాటూ తమిళనాడులో విధ్వంసాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఏదో ఉపద్రవం జరిగేలోగా ఆరుగురిని పట్టుకోవాలని ఎన్ఏఐ అధికారులు గాలింపును తీవ్రతరం చేశారు. తమిళనాడులో ఐఎస్ తీవ్రవాదుల సంఖ్యలో కన్యాకుమారీ జిల్లా నాల్గవస్థానంలో ఉన్నట్లు అందిన సమాచారం ఎన్ఏఐ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కన్యాకుమారీ జిల్లా తిరువిదాంగేడు ఉత్తమన్ ప్రాంతానికి చెందిన అన్సార్ మీరన్ చెన్నైలో దాక్కుని ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఏఐ అధికారులు సోమవారం రాత్రి అన్సార్మీరన్ను చెన్నైలో అరెస్ట్ చేశారు. అన్సార్ మీరన్ తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చెన్నైలో ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతూ ఐఎస్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. తన ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారానే భారతదేశానికి చెందిన యువకులకు సిరియాకు విమాన టికెట్లు సమకూర్చాడు. అన్సార్ మీరన్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి ఎన్ఏఐ అధికారులు విచారిస్తున్నారు. తమిళనాడు నుంచి సిరియాకు ఎంతమంది యువకులను పంపారనే వివరాలను రాబట్టుతూ గాలింపును తీవ్రతరం చేశారు. అన్సార్ మీరన్‌ను పూందమల్లిలోని ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరుపరిచి పుళల్ సెంట్రల్ జైలుకు పంపారు. అన్సార్ మీరన్‌ను పదిరోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ ఎన్ఏఐ అధికారులు మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు. -
చంచల్‌గూడ జైల్లో భద్రతా లోపాలు
-
ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రదాడి, 74 మంది మృతి
-
ఐసిస్ నరమేధం.. 74 మంది మృతి
నసీరియా: ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ మరోసారి రెచ్చిపోయింది. ఇరాక్‌లోని దిఖర్ ప్రావిన్సు నసీరియా పట్టణంలో ఓ రెస్టారెంట్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాదులు, అనంతరం సమీపంలోని చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 74 మంది దుర్మరణం చెందగా, 91 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా భద్రతాబలగాలతో కలిసి పోరాడుతున్న షియా సంస్థ ‘హషీద్ అల్ షాబీ’ సభ్యుల రూపంలో ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. -
ఆ..11మంది ఎక్కడ?
ఐఎస్ఐఎస్ మద్దతుదారులు 11 మంది చెన్నైలో తిష్ట వేసినట్టుగా లభించిన ఆధారాలతో వారికోసం వేట మొదలైంది. రాజస్థాన్ నుంచి ప్రత్యేక బృందం రంగంలోకి దిగి వారెక్కడ ఉన్నారోనని ఆరాతీస్తోంది. చాప కింద నీరులా చెన్నైలో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు విస్తరిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ♦ చెన్నైలో తిష్టవేసిన ఐఎస్ఐఎస్ మద్దతుదారులు ♦ చాప కింద నీరులా విస్తరణ ♦ ఆచూకీ కోసం రాజస్థాన్ బృందం వేట ♦ ముగ్గురికి సమన్లు సాక్షి, చెన్నై : రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక నగరం మదురై తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉండడంతో భద్రతపరంగా అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏదేని తీవ్రవాద కార్యకలాపాలు బయటపడ్డ పక్షంలో, అది చెన్నై చుట్టూ తిరుగుతుండడం ఉత్కంఠను రేపుతోంది. ఇదివరకు అల్ ఉమ, సిమి వంటి నిషేధిత తీవ్రవాద సంస్థలపై గురిపెట్టి వారి మద్దతుదారుల్ని ఏరిపారేశారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ఐఎస్ఐఎస్ నినాదం మార్మోగుతుండడంతో భద్రతపరంగా ఆందోళనలు తప్పడం లేదు. గత ఏడాది చివరల్లో కేరళలో ఐఎస్ఐఎస్ కదలికల్ని జాతీయ నేర పరిశోధన సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. ఈకేసు విచారణ మేరకు చెన్నైలో ఒకరు, తిరునల్వేలి జిల్లా కడయనల్లూరులో మరొకర్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టుచేశాయి. అలాగే, ఐఎస్ఐఎస్ ప్రధాన కేంద్రం సిరియాకు వెళ్లే క్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు వివిధ దేశాల్లో అరెస్టు కావడం ఆందోళన రేపుతోంది. ఐఎస్ఐఎస్ వలలో మరెవరైనా పడిఉన్నారా..? అన్న ఆందోళన నెలకొనడంతో చాపకింద నీరులా సాగుతున్న అసాంఘిక వ్యవహారాల గుట్టు రట్టు చేయడానికి తమిళ పోలీసు దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ఇందుకు కారణం, ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు, ప్రత్యేక బృందాలు ఇక్కడికి వచ్చి ఆ సంస్థ మద్దతుదారుల్ని చడీ చప్పుడు కాకుండా పట్టుకెళ్తుండడమే. ఇక, రాష్ట్రంలో ఇటీవల హిందూ సంఘాల నేతల్ని గురిపెట్టి దాడులు సాగుతుండటం, ఐఎస్ఐఎస్కు నిధుల్ని సేకరించి పంపించే వాళ్లు పెరుగుతుండడం బట్టి చూస్తే నిషేధిత కార్యకలాపాలు చాప కింద నీరులా మరింతగా విస్తరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. మద్దతుదారులు ఎక్కడున్నారు? కేంద్ర నిఘా సంస్థ గత కొన్ని నెలలుగా రాష్ట్రం మీద గురి పెట్టి తరచూ నిషేధిత సంస్థ మద్దతుదారుల్ని తన్నుకెళ్తూ వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో ఉత్కంఠ తప్పడం లేదు. తమకు పట్టుబడ్డ జమిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన రాజస్థాన్ పోలీసులు గత వారం మైలాపూర్‌లోని మహ్మద్ ఇక్బాల్‌ను అరెస్టుచేసి తీసుకెళ్లారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నైలో మరో 11 మంది ఐఎస్ఐఎస్ మద్దతుదారులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే, ఆ 11 మంది ఎక్కడున్నారో అన్న ప్రశ్న బయలుదేరింది. వారి ఆచూకీ కోసం వేట మొదలెట్టేందుకు ప్రత్యేక బృందం రాజస్థాన్ నుంచి చెన్నైకి ఆదివారం దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళ పోలీసులతో కలసి ఆ మద్దతుదారుల కోసం వేట సాగుతుండడంతో ఐఎస్ఐఎస్కు ఆకర్షితులైన యువత మరెంతమంది ఉన్నారో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వీరి వేట ఓవైపు సాగుతుంటే, మరోవైపు మన్నడికి చెందిన రాజా మహ్మద్, సికిందర్, చాకలి పేట నేతాజీనగర్‌కు చెందిన రియాజుద్దీన్లకు రాజస్థాన్ పోలీసులు సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ ముగ్గుర్ని తమ విచారణకు రావాలని ఆదేశించినట్టు, వీరు రాజస్థాన్‌కు బయలుదేరి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఆ ముగ్గుర్ని రాజస్థాన్‌లో అరెస్టు చేస్తారా..? వారి వద్ద సాగే విచారణ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏమేరకు నిషేధిత సంస్థ మద్దతుదారులు ఉన్నారో అనేది తేలనుంది. -
'యువకులను ప్రలోభపెట్టి.. ఐఎస్ఐఎస్లో చేరుస్తున్నా'
హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మహిళా ఉగ్రవాది నిక్కీ జోసెఫ్‌ను శనివారం పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. నిక్కీ జోసెఫ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. యువకులను ప్రలోభపెట్టి.. ఐఎస్ఐఎస్లో చేరుస్తున్నటుగా నిక్కీ జోసెఫ్ అంగీకరించింది. జడ్జి.. నిక్కీ జోసెఫ్ కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నిక్కీ జోసెఫ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన పలువురిని ఐఎస్ఐఎస్లో చేర్చేందుకు ఈమె ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమె ప్రియురాలని, ఈమె ఇంగ్లండ్ దేశస్థురాలని తెలుస్తోంది. ఈమెకు 2011లోనే మొయినుద్దీన్‌తో పరిచయం అయ్యింది. ఇక్కడ కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన తర్వాత.. దుబాయ్ వెళ్లిపోయింది. ఆమెను పోలీసులు అత్యంత చాకచక్యంగా హైదరాబాద్‌కు రప్పించి అరెస్ట్ చేశారు. -
ఆన్లైన్లో ఉగ్రవాద దాడి వీడియో!
భీకర దాడులతో రక్తపాతం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ వీడియోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా.. జనవరి 9న తూర్పు పారిస్‌లోని కోషర్ మార్కెట్లో నలుగురిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది అమెడి కౌలిబాలి అప్లోడ్ చేసిన వీడియో ఆన్లైన్లో కలకలం రేపుతోంది. కోషర్ మార్కెట్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అమెడి మరణించాడు. నలుగురిని చంపిన ఆ ఉగ్రవాది.. తాను చావడానికి కొన్ని నిమిషాల ముందు అదే మార్కెట్లో ఉన్న ఓ కంప్యూటర్ను ఉపయోగించి ఓ వీడియోను అప్లోడ్ చేసినట్టు పారిస్ పోలీసు అధికారుల తెలిపారు. ఆ వీడియోలో అమెడి రకరకాల గెటప్‌లో కనిపించాడు. చార్లీ హెబ్డోపై జరిగిన దాడితో తనకు సంబంధం ఉందని, ఆ దాడిలో తానూ పాల్గొన్నానని చెప్పుకొన్నాడు. తమపైన, తమ ప్రజలపైన అన్యాయంగా పాశ్చాత్యదేశాలు దాడులు చేస్తున్నందున తాము దాడులు జరపాల్సి వస్తుందని సమర్థించుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని హెచ్చరించాడు. తమ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నాశనం చేసేందుకు వైమానిక దాడులు కూడా చేస్తున్న ఫ్రాన్స్‌లో మరిన్ని దాడులు జరుపుతామని బెదిరించాడు. ఇంతకుముందు పారిస్‌లోని చార్లీ హెబ్డో అనే వ్యంగ్య పత్రికపై దాడులు జరిపి ఇద్దరు పోలీసులు సహా 12 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ తర్వాత విడుదల చేసిన వీడియోలో తమ పాశవిక చర్యను సమర్థించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ వీడియోను కూడా వాళ్లు బయటపెట్టారు. -
ఐఎస్ఐఎస్ అనుమానిత యువకుడి అరెస్ట్
హైదరాబాద్: పాతబస్తీ అసిఫ్ బాబానగర్‌లో శుక్రవారం రాత్రి ఓ యువకుడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ తో సంబంధం ఉందన్న సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్టైన యువకుడు సయ్యద్ కరీం అనే యువకుడిగా ఎన్ఐఏ పేర్కొంది.