అక్రమంగా బాణాసంచా తయారి చేస్తున్న ఇంట్లో పేలుడు సంభివించింది.
అక్రమంగా బాణాసంచా తయారి చేస్తున్న ఇంట్లో పేలుడు సంభివించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ ఇంట్లో పెద్ద శబ్ధంతో కూడిన పేలుడు సంభవించడంతో.. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. షాక్‌లో నుంచి తేరుకునే లోపే ఓ ఇంట్లో భారీ ఎత్తున మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అందులో ఉన్న ముగ్గురిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.