పావురాలగుట్టకు ఇలా చేరుకోవాలి.. | how to reach pavulagutta | Sakshi
Sakshi News home page

పావురాలగుట్టకు ఇలా చేరుకోవాలి..

Published Thu, Sep 1 2016 6:32 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

పావురాలగుట్టకు ఇలా చేరుకోవాలి.. - Sakshi

పావురాలగుట్టకు ఇలా చేరుకోవాలి..

వైఎస్సార్‌ మృతి చెందిన పావురాలగుట్టకు వెళ్లాలంటే ముందుగా నల్లకాలువ గ్రామం చేరుకోవాలి. అక్కడి నుంచి గాలేరు నది దాటిన అనంతరం అటవీ మార్గంలో 18  కిలోమీటర్లు ప్రయాణిస్తే రుద్రకోడు క్షేత్రానికి వెళ్లే రహదారి వస్తుంది. ఈ రహదారికి ఎడమ వైపున ఉన్న మార్గంలో ప్రయాణించాలి. ఇలా సుమారు పది కిలోమీటర్లు వెళితే పావురాల గుట్ట వస్తుంది. ఇందులో ఎనిమిది కిలోమీటర్ల వరకు రహదారి ఉంది. రెండు కిలోమీటర్లు కాలినడకన కొండ ఎక్కాల్సి ఉంది. కొండ ఎక్కే సమయంలో సెలయేరుల్లో కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. పావురాలగుట్టకు కొత్తగా వచ్చే వారు దారి తప్పకుండా ఉండేందుకుగాను సెలయేరు ప్రారంభం నుంచి కొండకు ఎక్కే మార్గం వరకు కొండరాళ్లకు దారి చూపే గుర్తును పెయింట్‌తో వేశారు. ఈ గుర్తుల ఆధారంగా పావురాల గుట్టకు సురక్షితంగా చేరుకోవచ్చు. ప్రయాణంలో గాలేరు నది మాత్రమే అత్యంత ప్రమాదకరమైనది. మిగతా 11 సెలయేర్లతో ఎలాంటి ప్రమాదం లేదు. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు.
– ఆత్మకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement