Published
Sat, Mar 4 2017 10:14 PM
| Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
నల్లమలలో మంటలు
మహానంది: నంద్యాల–గిద్దలూరు ఘాట్‌రోడ్డులోని నల్లమల అడవిలో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో సర్వనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత చలమ ముఖద్వారం సమీపంలో మంటలు వ్యాపించాయి. కింది నుంచి పై వరకు మంటలు చెలరేగాయి. ఘాట్ రోడ్డు వెంబడి వెళ్తున్న వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సమీపంలో పచ్చర్ల గ్రామం ఉంది. వేసవికాలం కావడంతో అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని అగ్నిప్రమాదాల నుంచి అడవిని కాపాడాలని అటవీ పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.