నంద్యాల: సాయంత్రం ఆరు గంటల తర్వాత నల్లమల అడవిలోకి ప్రవేశాలను నిలిపివేయాలని నంద్యాల అటవీ డీఎఫ్‌వో శివప్రసాద్ అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణలో భాగంగానే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాత్రి వేళల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వాహనాలకు ప్రవేశం నిలిపివేస్తున్నామన్నారు.
నల్లమలలోని పాములేటయ్య, గరుడాద్రి తదితర క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోందని, ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారు సాయంత్రమే అహోబిలం చేరుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలో సంచరిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు.