
తగ్గిన అటవీ ఉత్పత్తుల సేకరణ
అచ్చంపేట: అటవీఉత్పత్తులకు పుట్టినిల్లు.. నల్లమలలో అటవీ ఉత్పత్తుల సేకరణ ఏటా తగ్గిపోతోంది. దీంతో ఉపాధి మార్గా లు కూడా తగ్గిపోతుండడంతో చెంచుగిరిజనుల జీవనోపాధి కష్టతరంగా మారింది. రోజంతా అడవిలో తిరిగినా కనీస కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని చెంచులు వాపోతున్నారు. అటవీప్రాంతంలో ఫలసాయాన్ని అందించే కుంకుడు, కానుగ, ఇప్పచెట్లు, చింతచెట్లు, జిగురు చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు ఘననీయంగా తగ్గింది. 2011-12లో రూ.కోటి 43లక్షలు, 2012-13లో రూ.కోటి 12లక్షల విలువైన అటవీ ఉత్పత్తు లు కొనుగోలు చేస్తే 2013-14లో కేవలం రూ.89లక్షల విలువ గల వస్తుసేకరణ మా త్రమే జరిగింది. ఇదిలాఉండగా, రాష్ట్రం రెండుగా విడిపోయినా గిరిజన కార్పొరేషన్ మాత్రం ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటిగానే ఉంది. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, రం గారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇది కలిసి పనిచేస్తుంది. వీటి పరిధిలో 40డీఆర్‌డిపోలు, 10సబ్ డిపోలు ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబా ద్ మండలం మన్ననూర్‌లో గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీసీసీ) శాఖ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 22 డీఆర్ డిపోలు, ఏడు సబ్‌డిపో లు పనిచేస్తున్నాయి. ఐటీడీఏ పాత లెక్కల ప్రకారం 36వేల చెంచు జనాభా కలిగి ఉం డగా జిల్లాలోని 10 మండలాల పరిధిలో 112 చెంచుగూడెల్లో 7500 జనాభా ఉంది.
ధరలు పెంచినా..!
గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలను జీసీసీ ఈ ఏడాది పెంచింది. తేనే ధర ఇదివరకు కిలో రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.130కు పెంచింది. విషముష్టి గింజల ధర రూ.25నుంచి రూ.30, కానుగ గింజల ధర రూ.9.50 నుంచి రూ.10, విప్పపరక ధర రూ.14 నుంచి15,50, నరమామిడి చెక్క రూ.28నుంచి రూ.32కు పెంచారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో పెరిగిన ధరల ప్రకారం అమ్ముకొనే అవకాశం కల్పించారు. ధరల పెంపు బాగానే ఉన్నా.. ఉత్పత్తుల సేకరణ తగ్గిపోవడంతో చెంచులకు ఉపయోగం లేకుండాపోయింది.
ఆదాయం పెంచేందుకు జీసీసీ శ్రీకారం
గిరిజన సహకార సంస్థ అటవీ ఉత్పత్తుల సేకరణను పెంచేందుకు ప్రత్యేకచర్యలు తీసుకోవడంతో పాటు కొత్త వరవడికి జీసీసీ శ్రీకారం చుట్టింది. అటవీ సమీప గ్రామాల్లో సబ్‌డిపోలను ఏర్పాటు చేసేందుకు సహకార సంస్థ ముందకు వచ్చింది. దీంతో దూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లి అటవీఉత్పత్తులు అమ్ముకొనే శ్రమ గిరిజనులకు తగ్గుతుంది.
అలాగే చెంచుల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దోమలపెంట, మన్ననూర్, కొండనాగుల, లింగాలలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు, ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. పట్టా భూములు కలిగిన చెంచులకు రూ.10వేల వరకు పంట రుణాలను పావులావడ్డీ కింద అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కిరాణాదుకాణం ఏర్పాటు చేసుకునే చెంచులకు రూ.10వేల రుణ సహాయం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. డీఆర్‌డీపోల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక గ్రూపులకు అప్పగించే యోచనలో జీసీసీ ఉంది.