హీరో, హీరోయిన్లుగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లు | nallamala movie is ready to release | Sakshi
Sakshi News home page

విడుద‌ల‌కు సిద్ద‌మైన `న‌ల్ల‌మ‌ల‌`

Published Fri, Jul 23 2021 9:04 PM | Last Updated on Fri, Jul 23 2021 9:49 PM

nallamala movie is ready to release - Sakshi

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం `న‌ల్ల‌మ‌ల‌`. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  రవి చరణ్ ‌దర్శ‌కుడు.

ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ ఇప్ప‌టికే 17 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం. అలాగే ఈ చిత్రంనునుండి విడుద‌లైన అన్ని పాట‌లు 1మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించ‌డం ఆడియ‌న్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement