పెళ్లి చూపులకు వెళ్తూ.. | Three injured while going to marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులకు వెళ్తూ..

Published Wed, Jul 19 2017 6:47 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

పెళ్లి చూపులకు వెళ్తూ.. - Sakshi

పెళ్లి చూపులకు వెళ్తూ..

∙ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
∙ నల్లమల ఘాట్‌లో ఘటన
∙ కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులు
∙ నుజ్జునుజ్జయిన కారు

నల్లమల ఘాట్‌(మహానంది):  నంద్యాల–గిద్దలూరు రహదారిపై నల్లమల ఘాట్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మార్కాపురం గ్రామానికి చెందిన మర్రి రమణ, సుభద్ర దంపతులు తమ కుమారుడు కిరణ్‌కు పెళ్లి చూపుల కోసం కారులో స్వగ్రామం నుంచి బయలుదేరారు. పచ్చర్ల సమీపంలో ఉన్న కల్వర్టు మలుపుల వద్ద వేగంగా వస్తున్న బండల లారీ కారును ఢీకొట్టింది. దీంతో రమణకు నడుము, సుభద్ర కాలు, చేయి విరిగాయి. కిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి.  డ్రైవర్‌ సురేష్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

కారు నుజ్జనుజ్జవడంతో దాదాపు గంటపాటు వారు వాహనం నుంచి బయటకు రాలేకపోయారు. అటుగా వచ్చిన ప్రయాణికులు వారిని 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి  తీసుకెళ్లారు. మహానంది ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు  సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన సిబ్బందితో కలిసి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి వెÐðళ్లి వివరాలు సేకరించారు. కారు డ్రైవర్‌ సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement