Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటలు | Devotee Rush Continues at Tirumala, 18-Hour Wait for Sarva Darshan | Sakshi
Sakshi News home page

Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Published Thu, Sep 19 2024 8:09 AM | Last Updated on Thu, Sep 19 2024 9:58 AM

Devotee Rush Continues at Tirumala, 18-Hour Wait for Sarva Darshan

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో  కంపార్ట్‌మెంట్లు నిండాయి. కృష్ణతేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 78,690 మంది స్వామివారిని దర్శించుకోగా 26,086 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు.

 టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. టిక్కెట్లు లేని భక్తులకు 18  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్‌లో అనుమతించారని తెలుపుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement