Rush Tirumala
-
Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. కృష్ణతేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 78,690 మంది స్వామివారిని దర్శించుకోగా 26,086 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్లో అనుమతించారని తెలుపుతున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,223 కాగా, నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,549. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్లు.శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో గత మూడు రోజులుగా చేపట్టిన జ్యేష్టాభిషేక మహోత్సవం గురువారంతో ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత అర్చకులు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి అక్కడ వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం చేపట్టారు.తర్వాత కవచాలకు పూజలు, హారతి సమరి్పంచి స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి స్వామివారు తిరుచ్చిపై అధిరోహించి ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్‌రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనుంజయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
Tirumala: ఏప్రిల్ 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,163 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,287 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 2.99 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సెలవురోజు కావడంతో ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్శదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి మూడు గంటల సమయం తీసుకుంటోంది. కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇందుకోసం నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటలు పడుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 81,287 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.