సెలవురోజు కావడంతో ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
సెలవురోజు కావడంతో ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్శదర్శనానికి 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి మూడు గంటల సమయం తీసుకుంటోంది. కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇందుకోసం నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటలు పడుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 81,287 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.