అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి స్వామివారికి గురువారం రూ.2కోట్లు విరాళం సమర్పించాడు. ఆ డబ్బును శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్ కు ఉపయోగించాలని అతడు కోరాడు. కాగా గతంలోనూ అజ్ఞాత భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. తిరుపతిలో తరచూ ఇటువంటి సంఘటనలు కనిపిస్తుండటం తెలిసిందే.