
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపలికి క్యూలైన్లో బారులు తీరారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 18 కంపార్ట్మెంట్లు నిండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయటకు క్యూ లైన్లలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
అయితే మూడు రోజుల పాటు టీటీడీ శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. కాగా, నిన్న శ్రీవారిని 97,307 మంది భక్తులు దర్శించుకున్నట్టు టీటీడీ పేర్కొంది.