ఇంద్రకీలాద్రిపై శుక్రవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శుక్రవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగు పడింది. అమ్మవారి క్యూలైన్ పక్కనే ట్రాన్స్ఫారమ్ ఉండటంతో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో సదరు భక్తురాలు స్పృహ కోల్పోయింది. వెంటనే ఆలయ సిబ్బంది స్పందించి... ఆమెను ఆసుపత్రికి తరలించారు.