తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఏడు కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. శ్రీవారి సర్వ దర్శనానికి ఏడు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తి అవుతోంది.