
హరిద్వార్‌లో ఒక యువ భక్తుడు ఒక భుజాన తల్లిని, మరోభుజాన గంగానది జలం ఉన్న బిందెలను మోసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు గంగాజలాన్ని మోసుకు వస్తారు. దేశంలోని జ్యోతిర్లింగాలకు ఈ పవిత్రమైన నీటితో జలాభిషేకం చేస్తారు.
పదకొండు సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ కొందరు పురాణాలలోని శ్రవణకుమారుడిని గుర్తు తెచ్చుకున్నారు. ‘ఈ కాలంలో ఇలాంటి దృశ్యం చూడడం అపురూపంగా ఉంది’ ‘కడుపులో నవ మాసాలు మోసిన తల్లిని భుజాన మోయడం అదృష్టం’... ఇలా రకరకాలుగా స్పందించారు నెటిజనులు.