Ganges River
-
మహాజన సమ్మేళనానికి శ్రీకారం
విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి, అక్కడి నుండి శివుడి జటా జూటంలో పడి, హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగి వచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్నదని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా అక్కడ జరుపుతారు.12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమ యాన్ని ‘కుంభమేళా’ అనీ, ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అనీ, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ‘మాఘీమేళా’ అనీ పిలుస్తారు. ‘కుంభము’ అంటే బాండము అనీ, ‘కలశం’ అనీ మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభ మేళా జరుగుతుంది. ‘సూర్యుడు మకర రాశిలో, బృహ స్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా’, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్ధ కుంభమేళా జరుగుతుంది.కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు, రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగు తున్న సాంప్రదాయిక ఊరేగింపు జరుగుతుంది. ఈ సమయంలో నాగ సాధువులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, అఖాడాలు ముందు నడుస్తుండగా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా అను సరిస్తారు. అనంతరం ‘షాహిస్నాన్’ (పుణ్యస్నానాలు) ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు.వీరంతా ‘ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. జనవరి 24, 25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం, 26 తేదీన దేశం నలు మూలల నుండి 128 ఆరాధన మార్గాలకు చెందిన ‘సంత్ సమ్మేళనం’, 27వ తేదీన ‘యువ సంత్’ (యువ సన్యా సుల) సమ్మేళనం జరుగబోతున్నది ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్ని వేశం కుంభమేళ. సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017లో అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొ న్నట్లు, 2001వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ఆధ్యా త్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్య్రం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు. అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని గుర్తు చేసుకొని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరు గుబాటు ఆందోళనలు జరగడానికి, స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి. నానా సాహెబ్ పీష్వా, ధుంధుపంత్, బాలాసాహెబ్ పేష్వా, తాంతియా తోపే, ఝాన్సీరాణి లక్ష్మిబాయి, రంగోజి బాపు, జగదీష్పూర్ జమీందార్ బాబు కున్వర్ సింగ్ మొదలైన వారు పాల్గొన్న ఈ ఉద్యమంలో సామాన్య ప్రజలను కూడా భాగస్వాములు కావాలనే సందేశాన్ని తెలియజేయడానికి తామర పువ్వును, రొట్టెలను ప్రసా దంగా పంచి పెట్టాలని ఇక్కడే నిర్ణయించారు. ఈ సంవత్సరం ప్రయాగరాజ్ ‘మహా కుంభమేళా’ జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగ బోతోంది. కుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్‌కు 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. భక్తులకు ఏర్పాట్లు సౌకర్యాల నిమిత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రూ. 2,100 కోట్లు విడు దల చేయాలని నిర్ణయించింది. అలాగే కుంభ మేళ్లా జరిగే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా భారీగా నిధులను కేటా యించి ఈ అద్భుత యజ్ఞాన్ని నిర్వహించ తలపెట్టడం ముదావహం. మహా కుంభమేళా జరిగే స్థలాలుగంగానదిలో (హరిద్వార్– ఉత్తరాఖండ్) క్షిప్రానదిలో (ఉజ్జయిని– మధ్యప్రదేశ్)గోదావరి నదిలో (నాసిక్– మహారాష్ట్ర)గంగా నదిలో (ప్రయాగ్‌రాజ్–ఉత్తరప్రదేశ్;గంగా, యమునా, అంతర్వాహినిగా ప్రవహి స్తున్న సరస్వతి నది సంగమం వద్ద.)ముఖ్యమైన రోజులు1. పౌష్య పూర్ణిమ: జనవరి 13 సోమవారం2. మకర సంక్రాంతి: జనవరి 14 మంగళవారం– మొదటి షాహిస్నానం.3. మౌని అమావాస్య (సోమవతి): జనవరి 29 బుధవారం– రెండవ షాహిస్నానం.4. వసంత పంచమి: ఫిబ్రవరి 3 సోమవారం– మూడవ షాహిస్నానం.5. మాఘీ పూర్ణిమ: ఫిబ్రవరి 12 బుధవారం6. మహాశివరాత్రి: ఫిబ్రవరి 26 బుధవారం – ఆకారపు కేశవరాజు ‘ వీహెచ్‌పీ కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ -
జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా
మహా కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక పరంపరకు ఒక నిలువుటద్దం. భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతకలిగిన మహాసమారోహం. గంగా నదీ తీరంలో కూడే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం. మహా కుంభ మేళాకు సుమారు 40 కోట్ల్ల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. పురాణాల ప్రకారం, దేవతలు అసురులు అమృతాన్ని పొదేందుకు కలసి సముద్ర మథనాన్ని నిర్వహించారు. అమృతపు కుంభం (పాత్ర)నుంచి నాలుగు బిందువులు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్‌లలో పడ్డాయి. అవి పడ్డ ఈ నాలుగు ప్రదేశాలూ కుంభమేళా జరిగే పవిత్ర క్షేత్రాలుగా స్థిరపడ్డాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామేళా జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (మునుపటి అలహాబాద్) లో జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.కుంభమేళాలో పాల్గొనడం పాపవిమోచనకు దోహదపడుతుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. భారతదేశంలోని వివిధ ్రపాంతాల నుండి వచ్చిన సాధువులు, నాగసాధువులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మహాసమారోహంలో పాల్గొంటారు. ఈ సాధువులు తమ ఆధ్యాత్మిక సాధనను ప్రదర్శించడం, భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. పండితులు, ఆధ్యాత్మిక గురువులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై ఆసక్తికరమైన చర్చలు నిర్వహిస్తారు. ఈ చర్చలు భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తాయి. ఈ ఉత్సవంలో సంగీతం, నృత్యం, నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ...ఈసారి కుంభమేళాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ్రపాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నదీజలాల శుభ్రతను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ ఉత్సవంలో పాల్గొనడం అందరూ సుకృతంగా భావిస్తారు. ‘కుంభమేళా భారతదేశపు ఆధ్యాత్మికత, ఐక్యత, విశ్వభావనల ప్రతీక. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పే ఈ‘మహాకుంభమేళా’ సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు పవిత్ర గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమ ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్‌లో జరగనుంది. చరిత్ర...మరో పారాణిక గాథ ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు పినతల్లి కద్రువ బానిసత్వం నుంచి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే ‘నీవు అమృతభాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్భలపై ఉంచితే నీవు, నీ తల్లి విముక్తులు కాగలరు. అప్పుడు నేను వెంటనే ఆ అమృతాన్ని దేవలోకం తీసుకొని వెళ్తాను’ అని చెప్పి అలాగే చేశాడు. ఈ క్రమంలోనే ఆ కలశం నుంచి భూలోకం లో నాలుగు నదులలో నాలుగుచోట్ల కొన్ని అమృతం చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశాలను పుణ్యస్థలాలుగా... పుణ్యతీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ్రపారంభమైంది.ధర్మరక్షణ కోసం...కుంభమేళాలో సాంప్రదాయిక ఊరేగింపు జరిగేటప్పుడు నాగ సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, అఖాడాలు కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండ గా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ,’ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు’.పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశము చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు, కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు. వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేయడం జరుగుతుంటుంది.అలనాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్‌ను సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 లో బెంగాల్‌కు చెందిన చైతన్య మహాప్రభు. తులసీ రామాయణాన్ని రచించిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర.వెల్లివిరిసే సమరసత...పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచేగాక ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్లమంది ప్రజలు కలిసి వచ్చి ్రపాంతీయ, భాషా, కుల భేదాలు మరచి తరతమ భేదాలు లేకుండా కుంభమేళా సందర్భంగా కలసి స్నానాలు చేస్తారు. ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ ఆవాసాలు, పానీయాలు, అల్పాహారాలు, భోజనాలు అందించడం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పుణ్యస్నానాలు మాత్రమే కాదు..కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునులచేత సన్యాసుల చేత నెలల తరబడి ఆ ్రపాంతంలోనే ఉండి కఠినసాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న ఎన్నో విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. పాటించవలసిన మంచిని బోధించి సమాజానికి మార్గదర్శనం చేసి చూపించే ఈ çకుంభమేళాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం అవసరం. కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు1. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగానదిలో,2. మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షీరాబ్ది నదిలో,3. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో 4. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద.12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని‘కుంభమేళా’ అని. ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ’మాఘీమేళా’ అనే పేరుతో పిలుస్తారు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. 2025 మేళా ముఖ్యమైన తేదీలు జనవరి 13 పూర్ణిమ సందర్భంగా, మొదటి రాజస్నానం జరుగుతుంది. జనవరి 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 03 వసంత పంచమి, ఫిబ్రవరి 12మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ముఖ్యంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. -
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో గంగా మహా హారతి (ఫొటోలు)
-
హర హర ‘మా’హా దేవా!
హరిద్వార్‌లో ఒక యువ భక్తుడు ఒక భుజాన తల్లిని, మరోభుజాన గంగానది జలం ఉన్న బిందెలను మోసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు గంగాజలాన్ని మోసుకు వస్తారు. దేశంలోని జ్యోతిర్లింగాలకు ఈ పవిత్రమైన నీటితో జలాభిషేకం చేస్తారు. పదకొండు సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ కొందరు పురాణాలలోని శ్రవణకుమారుడిని గుర్తు తెచ్చుకున్నారు. ‘ఈ కాలంలో ఇలాంటి దృశ్యం చూడడం అపురూపంగా ఉంది’ ‘కడుపులో నవ మాసాలు మోసిన తల్లిని భుజాన మోయడం అదృష్టం’... ఇలా రకరకాలుగా స్పందించారు నెటిజనులు. -
ఆవుదూడను చంపావ్.. ప్రాయశ్చిత్తంగా కూతుర్ని..!
భోపాల్: ప్రమాదవశాత్తు దూడ చావుకు కారణమైన ఓ వ్యక్తికి గ్రామపంచాయతీ పెద్దలు విచిత్రమైన శిక్ష విధించారు. తన సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాలని ఆ గ్రామపంచాయతీ పెద్దలు ఆదేశించారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వెంటనే సొంత కూతురుని వివాహం చేసుకుంటే పాపపరిహారం అవుతుందని సెలవిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా పతారియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా దూడ అడ్డం రాగా.. బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు దూడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూడ మరణించింది. అయితే దూడ చనిపోవడానికి అతడే కారణమని పంచాయతీ పెద్దలు తీర్మానం చేసి పరిహారం చేసుకోవాలని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి యూపీ వెళ్లి గంగానదిలో స్నానం చేసి వచ్చి.. ఊరిలో వాళ్లందరికీ అన్నదానానికి సిద్ధమయ్యాడు. ఇది అంతా పట్టించుకోని పంచాయతీ పెద్దలు తన సొంత మైనర్ బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ విషయంపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయడంతో కొంత మంది అధికారులు పతారియా గ్రామానికి వచ్చారు. మైనర్‌కు పెళ్లి చేయడం నేరమని చెప్పినా పంచాయతీ పెద్దలు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ అమ్మాయి ఆధార్ కార్డు తెప్పించి చూసి ఆమె వయస్సు 14 సంవత్సరాలుగా నిర్ధారించి మైనర్‌కు పెళ్లి చేయవద్దని తల్లిదండ్రులను, గ్రామపెద్దలను గట్టిగా హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీనిపై పతారియా పోలీస్ స్టేషన్ సీఐ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువని చెప్పారు. ఆవు దూడను చంపితే పరిహారం తప్పనిసరిని భావిస్తారని తెలిపారు. మరికొన్ని చోట్ల ఆవును గానీ, దూడను గానీ చంపితే.. కన్యాదానం చేస్తేనే ఆ పాపం పోతుందని నమ్ముతారన్నారు. అందుకే సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాల్సిందిగా తీర్పులు ఇస్తారని చెప్పారు. ఆ బిడ్డ చిన్న పాప అయినా సరే ఆచారాన్ని అమలు చేసి తీరుతారని.. వీటిని మార్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
‘గంగా స్నానం చేసి వస్తేనే గ్రామంలోకి రానిస్తాం’
భోపాల్ : అనుకోకుండా జరిగిన ఘటనకు ఓ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైంది. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్ల ఆవు మృతికి కారణమైన వ్యక్తి, అతని కుటుంబానికి గ్రామ పంచాయతీ సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానం చేశారు. గంగానదిలో మునిగి వస్తేనే తిరిగి గ్రామంలోకి రావాలని హుకుం జారీ చేశారు. దాంతోపాటు ఊరంతా భోజనాలు (కన్య అండ్ బ్రాహ్మణ్ భోజ్), ఒక గోవును దానంగా కూడా ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో తిరిగి ఊర్లోకి రానిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ ఘటన భోపాల్‌కు 402 కిలోమీటర్ల దూరంలోని షియోపూర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు.. పప్పు ప్రజాపతి (36) ఎప్పటిలాగానే తన ఇంటివద్ద ట్రాక్టర్‌ను పార్కింగ్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఆవును అతను గుర్తించలేదు. దీంతో ట్రాక్టర్ వెనక చక్రాల కిందపడి ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇది తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పంచమ్ సింగ్ పంచాయతీ నిర్వహించాడు. ప్రజాపతి గో హత్య చేశాడని తేల్చిన పంచాయతి సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానించారు. ‘ట్రాక్టర్ని పార్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ట్రాలీ వెనక చక్రాల కిందపడి ఆవు చనిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు చాలా బాధగా ఉంది. కానీ, పంచాయతీ పెద్దలు నేను గో హత్య చేశానంటూ దోషిగా నిలబెట్టారు. నాతో సహా కుటుంబం మొత్తానికి శిక్షలు ఖరారు చేశారు’ అని ప్రజాపతి వాపోయాడు. ఘటనపై సమాచారం అందిందనీ, అవసరమైన చర్యలు తీసకుంటామని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేంద్ర రాయ్ చెప్పారు. కాగా, పంచాయతీ తీర్పునకు కట్టుబడి ప్రజాపతి కుటుంబంతో సహా గంగానదిలో స్నానానికి బయలుదేరారు. పాపం మూటగట్టుకున్నారు.. గో హత్య చేసి ప్రజాపతి కుటుంబం పాపం మూటగట్టుకుంది. పంచాయతీ విధించిన శిక్షను వారు అనుభవిస్తే పాపపరిహారం జరుగుతుంది. -ఓం ప్రకాశ్ గౌతమ్, పంచాయతీ మెంబర్ -
పాప ప్రక్షాళనం
ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతి ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. శివుడు చిర్నవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండుముల్తైదు రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు. దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
జాతీయాలు
అంపశయ్య భీష్ముడు తనను నిరాకరించాడనే కోపంతో ‘నిన్ను సంహరిస్తాను’ అని శపథం చేస్తుంది అంబ. దీనికి సమాధానంగా ‘నువ్వు ఏ రోజు అయితే ఆయుధం చేతపూని నా ఎదుట నిల్చుంటావో... అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను’ అని ప్రతిన పూనుతాడు భీష్ముడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శివుడి కోసం తపస్సు చేసి ‘అంబ’ శిఖండిగా మారుతుంది. మహాభారత యుద్ధంలో... శిఖండిని అడ్డు పెట్టుకొని పాండవులు యుద్ధం చేయడం వల్ల భీష్ముడు అస్త్రసన్యాసం చేస్తాడు. భీష్ముడు అస్త్రసన్యాసం చేసిన వెంటనే అర్జునుడు అతని శరీరంపై బాణాల వర్షం కురిపిస్తాడు. ఆ బాణాలే అతని శయ్యగా మారుతాయి. ఎవరైనా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు లేదా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘అంపశయ్య పై ఉన్నట్లు ఉన్నాడు’ అంటారు. పెదగంగ ఉదకం గంగానది గురించి పురాణాల్లో ఎన్నో విశిష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ‘దేవగంగ’, ‘ఆకాశగంగ’ అనే పేర్లతో స్వర్గలోకంలో ప్రవహించేదట. ఆకాశగంగలో రాజహంసలు విహరిస్తాయట. బంగారు తామరలు అందంగా వికసిస్తాయట. స్వర్గానికి వెళ్లిన వారు ఇందులో స్నానం చేస్తారట. ఆకాశంలోని పాలపుంతను కూడా పెద గంగ అంటారు. ఆకాశ గంగ గొప్పదనం, అందం మాట ఎలా ఉన్నా... అది నిజంగానే ఉందా? లేక కల్పనా? అనేది తెలియదు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ‘పెదగంగ ఉదకం’ పెదగంగ ఉదకం అంటే ఆకాశగంగ. ఇది ఉందో లేదో ఎవరికీ తెలియదు. అంటే గగన కుసుమం లాంటిదన్నమాట! సంపాతి జటాయువులు... చాలా పాత తరం వ్యక్తులు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఇది. సంపాతి మరియు జటాయువులు రామాయణంలో పాత్రలు. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు. గద్దలు. సూర్యమండలానికి ఎవరు త్వరగా చేరుకుంటారనే దానిపై ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడతారు. ఈ పోటీలో జటాయువు త్వరగా సూర్యమండలం వైపు దూసుకెళతాడు. ఈ సమయంలో జటాయువు రెక్కలు కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సంపాతి తన రెక్కలు అడ్డుపెడతాడు. రెక్కలు కాలిపోతాయి. జటాయువు సీతమ్మను రక్షించే ప్రయత్నంలో రావణాసురుడితో యుద్ధం చేసి చనిపోయిన విషయం తెలిసిందే. సంపాతి, జటాయువుల త్యాగాల మాట ఎలా ఉన్నా... ‘పాత తరం వ్యక్తులు’, ‘చాలా అనుభవం ఉన్న వాళ్లు’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఏదైనా సందేహం ఉంటే వాళ్లను అడుగు. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు. సంపాతి జటాయువులు’ అంటారు. శకారుడు! శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’. పది అంకాలున్న నాటకం ఇది. ‘వసంతసేన’ అనే పాత్ర ఈ నాటకంలోనిదే. ఉజ్జయినిని పరిపాలించే రాజు బావమరిది శకారుడు. శకారుడికి లేని దుష్ట లక్షణం లేదు. శకారుడిలో మూర్ఖత్వం, అజ్ఞానం, దుర్మార్గం మూర్తీభవించి ఉంటాయి. తన అహంకారంతో ప్రజలను పట్టి పీడించేవాడు శకారుడు. దుర్మార్గాలకు పాల్పడేవాళ్లను, బంధువుల అధికారాన్ని అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టించేవాళ్లను శకారుడితో పోల్చుతారు. -
శివప్రీతికర క్షేత్రం... ముక్తిధామం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రంగా విఖ్యాతిగాంచిన కాశీక్షేత్ర మహిమ, విశ్వనాథలింగ విశిష్టత విశేషమైనవి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నిరంతరం శవదహనం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి మహాశ్మశానమని పేరు వచ్చింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీనగరంతో సమానమైన మహానగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెబుతున్నాయి. పురాతన శైవాధామాలలో ఒకటైన కాశీ సకల పాతక నాశినిగా, జ్ఞానప్రదాయినిగా, ముక్తిదాయినిగా పేరు గాంచింది. పావన గంగానదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శివపురి, ముక్తిభూమి, తపఃస్థలి, అవిముక్త్, వారణాసి తదితర పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ దివ్య ఈ క్షేత్రం గురించి కాశీఖండంలో ప్రముఖంగా ప్రస్తావించారు. గంగానదీమతల్లి ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోనే ‘వరుణ’, ‘అసి’ నదులు గంగలో కలుస్తాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరొచ్చింది. ఇక్కడ మూడువేల సంవత్సరాల క్రితం ‘కాశీ’ జాతివారు నివసించేవారు. అందువల్ల దీనికి కాశీ అని పేరొచ్చింది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ కథనం. పురాతన కాలంలోని ఆలయాన్ని శివభక్తురాలైన అహల్యాబాయి హొల్కర్ 1777లో తిరిగి నిర్మించగా, పంజాబ్ కేసరి మహరాజా రణ్‌జీత్ సింగ్ ఈ ఆలయంపై బంగారు రేకును తాపడం చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాశీక్షేత్రంలో కొలువైన కాశీవిశ్వనాథ లింగదర్శనం సర్వపాపహరణం. శివకైవల్య ప్రాప్తికి మూలం. గర్భాలయంలో కొలువైన విశ్వేశ్వరలింగం పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఫలితాన్నివ్వడంలో మాత్రం పెద్దది. ఈ పవిత్రక్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. సనాతన బ్రహ్మ మొదట నిర్గుణం నుంచి సగుణ శివరూపధారణ చేశాడు. తిరిగి శివశక్తి రూపంలో స్త్రీ పురుష భేదంతో రెండు రూపాల ధారణ చేశాడు. ప్రకృతి పురుషుడు (శక్తి- శివుడు) ఇద్దరినీ శివుడు ఉత్తమ సృష్టి సాధనకై తపస్సు చేయమని ఆదేశించాడు. తపస్సుకై ఉత్తమ స్థానం ఎంపిక చేశాడు. అప్పుడు నిర్గుణ శివుడు తన నుంచి సమస్త తేజస్సును ప్రోదిచేసి అత్యంత శోభాయమానమైన పంచకోశ నగరాన్ని నిర్మించాడు. అక్కడ స్థితుడైన విష్ణువు ఎంతోకాలం నుంచి శివునికై తపస్సు చేశాడు. అతని శ్రమ ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి విస్మయం చెందిన విష్ణువు తల ఆడించగా ఆయన చెవి నుంచి ఒక మణి కింద పడింది. అప్పటినుంచి ఆ స్థానం మణికర్ణికగా పేరుగాంచింది. మణికర్ణిక ఐదుక్రోసుల విస్తారం గల సంపూర్ణ జలరాశిని శివుడు తన త్రిశూలంతో బంధించాడు. దానిలో విష్ణువు సతీసమేతంగా నిదురించాడు. శివుని ఆజ్ఞమేరకు విష్ణువు నాభినుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ ద్వారా అద్భుత సృష్టి జరిగింది. బ్రహ్మ, విష్ణు పరమేశ్వరుల ద్వారా శాసించబడే ఈ నగరంలో దేవతలు కూడా శివకేశవుల దర్శనం కోరుకుంటారు. మోక్షప్రదాయిని అయిన ఈ క్షేత్రంలో చేసిన ఏ సత్కార్యమైనా సహస్ర కల్పాలలో కూడా క్షయం కాదు. బనారస్ అనే పేరు ఎందుకంటే..? బనారి నామధేయుడైన ఒక రాజు ఈ తీర్థస్థానపు వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు. అందువల్ల ఆయన పేరుమీదుగా కాశీని బనారస్ అని కూడా పిలుస్తారు. బనారస్‌లో పదిహేనువందల దివ్య ఆలయాలున్నాయి. కాశీలోని గంగాజలాన్ని రామేశ్వర క్షేత్రాన ఉన్న రామేశ్వర లింగానికి అభిషేక జలంగా వినియోగిస్తారు. కాశీనగరంలో కాలభైరవుడు శునకవాహనుడై గస్తీ తిరుగుతుంటాడని ప్రతీతి. ఈ నగరం బ్రహ్మ సృష్టి కాకపోవడం వల్ల బ్రహ్మ ప్రళయానికి ఇది నశించదు. అలాగే గంగానదీ తీరాన కాశీక్షేత్రాన 64 స్నానఘట్టాలున్నాయి. ఇవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. అసీఘాట్, దశాశ్వమేద ఘాట్, వర్ణ సంగమ, పంచగంగ, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ముఖ్యమైనవి. ఈ దివ్యక్షేత్రాన 59 శివలింగాలు, 12 సూర్యనారాయణమూర్తులు, 56 వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గామాతలు, 13 నరసింహులు, 16 కేశవాలయాలున్నాయి. వీటిలో బిందుమాధవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండి పాణేశ్వరుడి ఆలయాలు ముఖ్యమైనవి. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగాలలో హరిశ్చంద్రాది మహారాజులతోపాటు రామాయణ భారత భాగవత ప్రాశస్త్యం గల అపురూప క్షేత్రమిది. మోక్షపురాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో అమ్మవారు విశాలాక్షి అక్షత్రయంలో ఒకటి , అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. మాతా అన్నపూర్ణేశ్వరాలయం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. కాశీపుణ్యక్షేత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలోని అతి పవిత్రమైన స్థానాలు. కాశీక్షేత్రంలో మరణం, అంతిమ సంస్కారం ముక్తిమార్గాలుగా భావిస్తారు. కాశీక్షేత్ర సందర్శనం, కాశీవిశ్వనాథుని దర్శనం పూర్వజన్మల పుణ్యపలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు అంటుంటారు. - దాసరి దుర్గాప్రసాద్ -
వేదగోదావరికి దివ్యమంగళ హారతులు
భారతదేశం వేదభూమి. ఎందరో మహానుభావులు నడయాడిన పుణ్యభూమి. సనాతన సంస్కృతీ సంప్రదాయాలను ఎనలేని శ్రద్ధాభక్తులతో పాటించే కర్మభూమి. పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని కూడా పూజించే ధన్యభూమి. తమ పావన జలాల స్పర్శతో భక్తుల పాపాలను హరించే పుణ్యనదులు గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న తదితర పరమపావన తీర్థాలు. అటువంటి నదులను దేవతా స్వరూపాలుగా భావించి, ఆ జలాలకు దివ్యమంగళ హారతులు ఇచ్చే కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది. ముఖ్యంగా గంగానదికి ప్రతిరోజూ జరిగే హారతి కన్నులపండువుగా ఉంటుంది. జీవనది అయిన గోదావరీ మాతకు కూడా ఇటీవలి కాలంలో హారతి ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టింది బుద్ధవరపు దాతృత్వ సంస్థ. గత నాలుగేళ్లుగా ఈ సంస్థవారు ప్రతి పున్నమినాడూ వేదపండితుల పవిత్ర మంత్రోచ్ఛారణతో అంగరంగ వైభవంగా గోదావరి నదికి హారతులు ఇస్తున్నారు. వేలాదిమంది భక్తులు ఈ సుందర దృశ్యాన్ని కన్నులారా తిలకిస్తూ ఉండగా... సాక్షాత్తూ గోదావరీ మాతయే స్వయంగా ఈ హారతిని స్వీకరిస్తోందా అన్నట్లుగా జ లాలు పరవళ్లు తొక్కుతుంటాయి. షోడశ కళలు వర్థిల్లే పౌర్ణమినాడు ఆ కళలు ఉట్టిపడేట్లుగా అమ్మవారికి షోడశ హారతులు ఇస్తుంటారు. అతివృష్టి, అనావృష్టి లేకుండా సమవృష్టి ఉండేలా అమ్మవారికీ మహానీరాజనం సమర్పిస్తారు. లోకకల్యాణాభిలాషతో అమ్మవారికి పదహారు రకాల హారతులు ఇస్తున్నారు. అవి 1.ఏకహారతి, 2. నేత్రహారతి 3. బిల్వహారతి 4. పంచహారతి 5. సింహ హారతి 6. నృత్యహారతి 7. సర్పహారతి 8. నాగహారతి 9. చక్రహారతి 10. సుదర్శన హారతి 11.ధూపహారతి 12. దీపహారతి 13. అఖండ కర్పూర హారతి 14. కుంభ హారతి 15.నక్షత్ర హారతి 16. ముద్దహారతి. సాక్షాత్తూ సప్తరుషులే ఈ హారతులు ఇస్తున్నట్లుగా ఏడుగురు వేదపండితులు అమ్మవారికి జేగంటానాదం చేస్తూ, మంగళవాయిద్యాలు ఇస్తూ... ఛత్రచామర వింజామరలతో, వేదమంత్రోచ్ఛారణతో ఈ పవిత్ర కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగుతోంది. గత ముప్పై ఆరు నెలలుగా గోదావరి పుష్కరఘాట్ వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమం కార్తికమాసం సందర్భంగా మరింత మంగళకరంగా జరగనుంది. అత్యంత పెద్ద బింబంగా, స్వచ్ఛమైన తెల్లని కాంతులతో వెన్నెలలు కురిపించే, కార్తిక పౌర్ణమినాడు ఈ హారతి కార్యక్రమం గోదావరీ మాత భక్తులకు కనువిందు చేయనుందని ట్రస్ట్ సమన్వయ కర్త ఇంద్రగంటి రామచంద్రగోపాలం అంటున్నారు. - డి.వి.ఆర్. కార్తిక సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత? కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైనఅగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.