Viral Video: Man Carries Mother On Shoulder In Haridwar - Sakshi
Sakshi News home page

కలియుగ శ్రవణుడిలా.. తల్లిని భుజాలపై మోస్తూ..

Published Fri, Jul 7 2023 10:37 AM | Last Updated on Fri, Jul 7 2023 1:45 PM

Viral Video: Man Carries Mother On Shoulder In Haridwar - Sakshi

మనం పురాణాల్లో శ్రవణ కుమారుడు గురించి విని ఉన్నాం. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చాలన్న సంకల్పంతో శ్రవణుడు వారిద్దరిని ఒక కావిడిలో కూర్చొబెట్టుకుని తన భుజస్కందాలపై తీసుకువెళ్లి అందర్నీ ఆశ్చర్యచకితులు చేస్తాడు. తల్లిదండ్రుల పట్ల అతను చూపిని భక్తి ప్రపత్తులు అందర్నీ కదిలిస్తుంది. పైగా శ్రవణుడిని చూస్తే ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే సరిపోతుంది అనే భావన కలగకమానదు. అచ్చం అలాంటి దృశ్యమే కన్వర్‌యాత్రలో దర్శనమిచ్చింది. 

వాస్తవానికి కన్వర్‌ యాత్ర అనేది శివ భక్తుల వార్షిక యాత్ర. అందుకోసం అని బిహార్‌లోని సుల్తాంగంజ్‌, గంగోత్ర, గౌముఖ, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ యాత్రలు చేసి..పెద్దపెద్ద కంటైనర్‌లలో పవిత్ర గంగానదిని తీసుకువచ్చి..తమ ఊ‍ర్లలో ఉన్న  వివిధ శివాలయాలకు తీసుకువెళ్లి ఆ నీటితో శివుడిని అభిషేకస్తారు. దీన్ని కన్వర్‌ యాత్ర అంటారు. ఆ నీటిని తీసుకువెళ్లేందుకు ఉపయోగించే  కంటైనర్‌ని 'కాన్వర్‌' అని పిలుస్తారు. దీంతో ఆ పేరు మీదగానే ఈ యాత్ర పేరు స్థిరపడిపోయింది.

హరిద్వార్‌ నుంచి సాగే ఈ కన్వర్‌ యాత్ర జూలై 4 నుంచి ప్రారంభమై జూలై 15 వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో లక్షలాదిమంది శివ భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌, గౌముఖ​, గంగోత్రి, సుల్తాన్‌గంజ్‌కి హెవీ లోడ్‌లోతో పెద్ద ఎత్తున్న వెళ్తుంటారు. ఈ యాత్రలో భాగంగా ఓ వ్యక్తి తన తల్లిని భూజాలపై మోస్తు కనిపించాడు. కావడిలో ఒక వైపు తల్లి మరోవైపు గంగాజలం సేకరించే కంటైనర్‌ కనిపించింది. దీంతో అందరూ అతడ్ని కలియుగ శ్రవణుడు అని ప్రశంసించడం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: ఆమె పేరిట ఒకటి, రెండు కాదు!..ఏకంగా ఆరు ప్రపంచ రికార్డులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement