మనం పురాణాల్లో భక్త కబీర్, రామదాసులాంటి వాళ్లు భక్తులుగా ఎలా మారారో కథల్లో చదివాం. వారి భక్తి పారవశ్యంతో దైవానుగ్రహాన్ని ఎలా పొందారో కథలు కథలుగా చదివాం. అయితే అలాంటి సఘటనే రియల్‌గా చోటు చేసుకుంది. అచ్చం ఆ భక్తాగ్రేసుల మాదిరిగా మారిపోయి సాధు జీవితాన్ని గడిపోతుంది. అంతటి అత్యున్నత సివిల్ సర్వీస్‌లో ఉన్న ఆమె అన్నింటిని పరిత్యజించి ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసింది. ఆమె చెబితే గానీ తెలియనంతగా ఆహార్యం, జీవన విధానం మారిపోయింది. ఇంతకీ ఎవరామె..? ఆధ్యాత్మికత వైపుకి ఎలా ఆకర్షితురాలైంది అంటే..
ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడమంటే మామాలు మాటలు కాదు. మంచి ర్యాంకుతో ఐఏఏస్ లేదా ఐపీఎస్‌లాంటివి దక్కితే ఆ రేంజ్, హోదానే వేరెలెవెల్. ఎంతటి వారైనా వారి ముందు నిల్చొక తప్పదు. అంతటి ఐపీఎస్ అత్యున్నత పదవిని అలంకరించింది భారతి అరోరా. 1998 బ్యాచ్‌కి చెందిన ఈ మాజీ అధికారిణి హర్యానాలోని పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించింది.
అలాగే కర్నాల్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పనిచేశారు. ఆమె కెరీర్ మొత్తం బాబు పేలుళ్లకు సంబంధించిన కేసులను చాకచక్యంగా చేధించింది. అంతేగాదు ఎస్పీగా ముక్కుసూటి వైఖరితో.. ప్రముఖ రాజకీయ నాయకుడుని అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకులకే చెమటలు పట్టించిన చరిత్ర ఆమెది. నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా.. వెనుకడుగు వేయని ధీర వనిత భారతి అరోరా. అలాంటి ఆమె అనూహ్యంగా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షితురాలైంది.
భక్తురాలిగా మార్పు ఎలా అంటే..
2004లో బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు భారతి. అక్కడే ఆమెకు కృష్ణ భక్తిపై అమితమైన మోహం ఏర్పడింది. అలా ఆ పరంధామునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. అదే ఏ స్థాయికి చేరుకుందంటే..సర్వం పరిత్యజించి కృష్ణునికి అంకితమైపోవాలన్న భక్తిపారవశ్యానికి లోనైంది. ఆ నేపథ్యంలోనే ఇంకా పదేళ్ల సివిల్ సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. చెప్పాలంటే అచ్చం మీరాభాయిలా కృష్ణుడుని ఆరాధిస్తూ..సాధువులా జీవితం గడుపుతోంది మాజీ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా.
(చదవండి: 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!)
Comments
Please login to add a commentAdd a comment