Voluntary
-
కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..
మనం పురాణాల్లో భక్త కబీర్, రామదాసులాంటి వాళ్లు భక్తులుగా ఎలా మారారో కథల్లో చదివాం. వారి భక్తి పారవశ్యంతో దైవానుగ్రహాన్ని ఎలా పొందారో కథలు కథలుగా చదివాం. అయితే అలాంటి సఘటనే రియల్‌గా చోటు చేసుకుంది. అచ్చం ఆ భక్తాగ్రేసుల మాదిరిగా మారిపోయి సాధు జీవితాన్ని గడిపోతుంది. అంతటి అత్యున్నత సివిల్ సర్వీస్‌లో ఉన్న ఆమె అన్నింటిని పరిత్యజించి ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసింది. ఆమె చెబితే గానీ తెలియనంతగా ఆహార్యం, జీవన విధానం మారిపోయింది. ఇంతకీ ఎవరామె..? ఆధ్యాత్మికత వైపుకి ఎలా ఆకర్షితురాలైంది అంటే..ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడమంటే మామాలు మాటలు కాదు. మంచి ర్యాంకుతో ఐఏఏస్ లేదా ఐపీఎస్లాంటివి దక్కితే ఆ రేంజ్, హోదానే వేరెలెవెల్. ఎంతటి వారైనా వారి ముందు నిల్చొక తప్పదు. అంతటి ఐపీఎస్ అత్యున్నత పదవిని అలంకరించింది భారతి అరోరా. 1998 బ్యాచ్‌కి చెందిన ఈ మాజీ అధికారిణి హర్యానాలోని పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించింది. అలాగే కర్నాల్‌లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పనిచేశారు. ఆమె కెరీర్ మొత్తం బాబు పేలుళ్లకు సంబంధించిన కేసులను చాకచక్యంగా చేధించింది. అంతేగాదు ఎస్పీగా ముక్కుసూటి వైఖరితో.. ప్రముఖ రాజకీయ నాయకుడుని అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకులకే చెమటలు పట్టించిన చరిత్ర ఆమెది. నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా.. వెనుకడుగు వేయని ధీర వనిత భారతి అరోరా. అలాంటి ఆమె అనూహ్యంగా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షితురాలైంది. భక్తురాలిగా మార్పు ఎలా అంటే..2004లో బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు భారతి. అక్కడే ఆమెకు కృష్ణ భక్తిపై అమితమైన మోహం ఏర్పడింది. అలా ఆ పరంధామునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. అదే ఏ స్థాయికి చేరుకుందంటే..సర్వం పరిత్యజించి కృష్ణునికి అంకితమైపోవాలన్న భక్తిపారవశ్యానికి లోనైంది. ఆ నేపథ్యంలోనే ఇంకా పదేళ్ల సివిల్ సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. చెప్పాలంటే అచ్చం మీరాభాయిలా కృష్ణుడుని ఆరాధిస్తూ..సాధువులా జీవితం గడుపుతోంది మాజీ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. (చదవండి: 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!) -
కార్బన్ క్రెడిట్స్ మార్కెట్‌కు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్ వచ్చే ఏడేళ్లలో భారీగా విస్తరించనున్నట్టు ఈ రంగానికి సేవలు అందించే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ సీఎండీ మనీష్ దబ్‌కర తెలిపారు. 2030 నాటికి ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు (రూ.20.75 లక్షల కోట్లు) చేరుకుంటుందన్నారు. పలు కారణాల వల్ల ప్రస్తుతం ఈ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, డిమాండ్ తగ్గడంతో కార్బన్ క్రెడిట్ ధరలు 80 శాతం తగ్గినట్టు చెప్పారు. ‘‘స్వచ్ఛంద కార్బన్ ఆఫ్సెట్ మార్కెట్ 2021 నాటికి 2 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి క్షీణించడం వల్ల ఇప్పుడు 500 మిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అయినప్పటికీ పలు రేటింగ్ ఏజెన్సీలు కార్బన్ మార్కెట్ పుంజుకునే విషయమై సానుకూలంగా ఉన్నాయి’’అని దబ్‌కర వివరించారు. బార్క్లేస్ నివేదికను ఉదహరిస్తూ.. ‘‘పలు దేశాలు అమలు చేస్తున్న కఠినమైన పర్యావరణ అనుకూల విధానాలు, ప్యారిస్ ఒప్పందం కింద కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయంలో వాటి అంకితభావం, కార్పొరేట్ సస్టెయినబులిటీ లక్ష్యాలు అనేవి కార్బన్ క్రెడిట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది’’అని దబ్‌కర ఓ వార్తా సంస్థతో తెలిపారు. కార్బన్ క్రెడిట్ మార్కెట్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో మనీష్ దబ్‌కర తన అభిప్రాయాలను పంచుకున్నారు. కార్బన్ మార్కెట్‌కు కేంద్రం మద్దతు ‘‘కార్బన్ మార్కెట్‌కు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే కొంత వరకు కార్బన్ మార్కెట్ ఇక్కడ ఉంది. పునరుత్పాదక ఇంధనం కలిగి ఉన్నామంటే అది కార్బన్ క్రెడిట్ అవుతుంది. ఇంధన ఆదా సరి్టఫికెట్లు కూడా కార్బన్ మార్కెట్లో భాగమే. ఈ రెండింటినీ కలిపి కార్బన్ క్రెడిట్‌గా మార్చి విక్రయిస్తాం’’అని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లోగడ చెప్పడం గమనార్హం. ఇండోర్ కేంద్రంగా పనిచేసే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్లో ప్రముఖ కంపెనీగా ఉంది. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీలో ఊరట
న్యూఢిల్లీ: స్వచ్ఛంద దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది. కంపెనీకి లీజుకు ఇచి్చన విమానాలను స్వా«దీనం చేసుకునేందుకు లెస్సర్లు దాఖలు చేసిన పిటీషన్లను ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ.. ఇంకా వాటిని డీరిజిస్టర్ చేయనందున కార్యకలాపాల పునరుద్ధరణకు అవి అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. విమానాలు, ఇంజిన్లే గో ఫస్ట్ వ్యాపారానికి కీలకమైనవని, వాటిని తీసివేస్తే ’కంపెనీ మరణానికి’ దారి తీస్తుందని ఎన్సీఎల్టీ తెలిపింది. దీని వల్ల రుణభార సమస్య పరిష్కారానికి అవకాశమే లేకుండా పోతుందని వివరించింది. మరోవైపు తమ విమానాలు, ఇంజిన్లను తనిఖీ చేసుకునేందుకైనా అనుమతినివ్వాలంటూ లెస్సర్లు చేసిన విజ్ఞప్తిని కూడా ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. విమానాల భద్రతా ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) ఉంటుందని స్పష్టం చేసింది. మే 3 నుంచి గో ఫస్ట్ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
వాలంతరీ ‘రియల్ ఎస్టేట్స్’
సాక్షి, హైదరాబాద్: నీరు, భూమి యాజమాన్య శిక్షణా పరిశోధన సంస్థ (వాలంతరీ) భూములను నీటిపారుదల శాఖ అమ్మకానికి పెడుతోంది. వాలంతరీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధనశాల (టీఎస్ఈఆర్ఎల్)కు చెందిన 300 ఎకరాలను ప్లాట్లుగా చేసి అమ్మాలని, దీనిపై రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు భూములను అమ్మేందుకు పురపాలక శాఖకు ఆ భూములను అప్పగించాలని యోచిస్తోంది. వాస్తవానికి వాలంతరీ, టీఎస్ఈఆర్ఎల్కు హిమాయత్‌సాగర్, ప్రేమావతిపేట, కిస్మత్పురాలలో 217.15, 224.52 ఎకరాల చొప్పున భూములున్నాయి. ఇందులో వాలంతరీ, టీఎస్ఈఆర్ఎల్ కార్యాలయాలు పోను మిగిలిన భూములను అమ్మేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ భూములను మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండీఏకు బదిలీ చేస్తే, ఆ సంస్థ ఎకరాకు 2,900 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టి అమ్మనుందని సమాచారం. రుణాలు తీసుకునే వెసులుబాటుపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో సొంతవనరుల ద్వారా రాబడులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటిదాకా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని భూములను అమ్మకానికి పెట్టింది. కానీ, తొలిసారిగా నీటిపారుదల శాఖకు చెందిన భూములను ఆదాయ టార్గెట్‌గా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుండటం గమనార్హం. -
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
చైర్మన్, ఎండీ బాధ్యతల విభజన స్వచ్ఛందమే!
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థానాలను వేరు చేయడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా వివరించింది. ఈ మేరకు 2018 మేలో జారీ చేసిన ఆదేశాలను సరళతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో భారత కంపెనీల అభిప్రాయాలను రెగ్యులేటర్ తెలుసుకోవాలని, అయితే దీనిని ‘ఆదేశంగా’ భావించవద్దని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సూచనల నేపథ్యంలో సెబీ బోర్డ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతక్రితం సెబీ ప్రకటించిన నిబంధనల ప్రకారం, దేశంలో టాప్ 500 లిస్టెడ్ కంపెనీలు 2022 ఏప్రిల్‌లోపు చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవీ బాధ్యతలను విభజించాల్సి ఉంది. అవసరమైతే ప్రత్యేక అనుమతితో రెండేళ్లు సమయం తీసుకోవచ్చు. తగిన ఏకాభిప్రాయం రాలేదు ఈ విషయంలో ఇప్పటివరకూ తగిన స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో సోమవారం నాడు సమావేశమైన బోర్డ్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. టాప్ 600 లిస్టెడ్ కంపెనీ ఏకాభిప్రాయ ‘సమ్మతి’ 2019 సెప్టెంబర్‌లో 50.4 శాతం ఉంటే, 2021 డిసెంబర్ 31 నాటికి ఇది కేవలం 54 శాతానికి చేరినట్లు పేర్కొంది. కంపెనీల అగ్ర స్థానంలో అధికారాల విభజన వల్ల నిర్వహణా సామర్థ్యం, పర్యవేక్షణ మెరుగుపడుతుందని సెబీ నియమించిన ఉదయ్ కోటక్ నేతృత్వంలోని కమిటీ సూచనలు చేసింది. దీని ప్రాతిపదికనే 2018 మేలో సెబీ ఉత్తర్వులు వెలువడ్డాయి. తుది గడువకు మరో రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏఐఎఫ్ నిబంధనలకు సవరణ ఇదిలాఉండగా, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బోర్డ్ మంగళవారం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) నిబంధనల సవరణలను ఆమోదించింది. సెక్యూరిటీ, క్రెడిట్ రేటింగ్‌ల బహిర్గతం చేయడంసహా పలు అంశాలను రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లోనికి తీసుకువచ్చింది. ఒక ఇన్వెస్టీ కంపెనీకి చెందిన లిస్టెడ్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి మూడవ కేటగిరీ ఏఐఎఫ్‌లకు వెసులుబాటు కల్పిస్తూనే, ఇందుకు కొన్ని షరతులకు లోబడాల్సి ఉంటుందని బోర్డ్ స్పష్టం చేసింది. . కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసే దిశగా మరిన్ని కొత్త తరం సంస్కరణలను ప్రవేశపెట్టాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలతో మార్కెట్లలో ఏవైనా ఒడిదుడుకులు తలెత్తితే సరి చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా సెబీ బోర్డుతో సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెబీ తీసుకున్న పలు నిర్ణయాలను ప్రశంసించిన నిర్మలా సీతారామన్.. నిబంధనల భారాన్ని తగ్గించేందుకు, ఇన్వెస్టర్లకు పటిష్టంగా రక్షణ కల్పించేందుకు మరిన్ని చర్యలు అమలు చేయాలని సూచించారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌కు తోడ్పాటు ఇవ్వాలని, ఈఎస్జీ (పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్)పరమైన పెట్టుబడులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ బాండ్ మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. కీలకమైన ధోరణులు, భారత సెక్యూరిటీల మార్కెట్లపై అంచనాలు, వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం తదితర అంశాల గురించి ఆర్థిక మంత్రికి సెబీ చైర్మన్ అజయ్ త్యాగి వివరించారు. ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, సెబీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: ద్రవ్యోల్బణం పెరిగినా... వడ్డీరేట్లు పెరగవు -
ఎంపీపీ పీఠంపై వలంటీర్.. వైస్ ఎంపీపీగా విద్యార్థిని
పశ్చిమగోదావరి: వలంటీర్లు కొందరు సర్పంచ్‌లయ్యారు.. మరికొందరు ఎంపీటీసీ సభ్యులయ్యారు. కానీ వలంటీర్‌గా సేవలందిస్తున్న ఓ గిరిజన మహిళ అతి చిన్న వయసులోనే ఎంపీపీగా ఎన్నికైంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడేనికి చెందిన 24 ఏళ్ల కారం శాంతి ఇంటర్ వరకూ చదువుకున్నారు. గృహిణిగా ఉన్న శాంతి ఆ తర్వాత వలంటీర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆమెను దొరమామిడి–2 ఎంపీటీసీ అభ్యరి్థగా నిలబటెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాల్లో 2 ఏకగ్రీవం కాగా, రెండింటిలో ఇది ఒకటి. మిగిలిన 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కారం శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. – బుట్టాయగూడెం అతి చిన్న వయసులో ఓ యువతి మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో.. ఇంకా విద్యార్థినిగా ఉండగానే ఆమె ఎన్నికవడం విశేషం. మండలంలోని బొమ్మిడి గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన మేడవరపు విద్యాలక్ష్మి వయసు 22 ఏళ్లు. విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ సైన్సెస్ కళాశాలలో ఫార్మా–డి కోర్సు ఐదో సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లి మేడవరపు సుష్మ బొమ్మిడి మాజీ సర్పంచ్. తండ్రి కిరణ్ వైఎస్సార్సీపీ నేత. – ఉంగుటూరు చదవండి: ఆ సామాజికవర్గంలో ఆమె మొట్టమొదటి ఎంపీపీ -
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ విప్లవం
-
సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు : శంకర్ నారాయణ
-
నేటి నుంచి గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలు
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియ జోరందుకుంది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి తుది జాబితా సిద్ధం చేశారు. కీలకమైన ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) ఘట్టం నేటి నుంచి మొదలు కానుంది. ఈనెల 11 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాలుగు స్లాట్లలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 11,924 గ్రామ వలంటీర్ల ఉద్యోగాలకు మొత్తం 68,740 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే శ్రీకాకుళం నగరం, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 1704 వార్డు వలంటీర్ పోస్టులకు 4192మంది పోటీ పడుతున్నారు. వీరిలో సామాజిక బాధ్యత, సేవా దృక్పథంలో ఆసక్తినే ప్రధాన అర్హతగా చూసుకుని, అర్హులను ఎంపిక చేసేందుకు అన్ని మం డలాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీలతో కూడి న త్రిసభ్య కమిటీని నియమించారు. అలాగే అన్ని మం డలాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఎస్.వాసుదేవరావు ఆధ్వర్యంలో ఏడుగురితో సెంట్రల్ మానిట రింగ్ కమిటీని నియమించారు. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈవో టి.కైలాస గిరీశ్వర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ల కు ఒక్కో వలంటీర్‌ను నియమించనున్నారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు సంబంధించిన వివరాలతో ఒక కీ రిజిస్టర్ తయారు చేయాలని పంచాయతీరాజ్ కమిషన ర్ గిరిజాశంకర్ ఇప్పటికే ఎంపీడీవోలను ఆదేశించారు. ఇంటర్వ్యూలు ఇలా.... ఇంటర్వ్యూ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేలా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో టి.కైలాస్ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావులు తగు చర్యలు చేపట్టారు. ఈనెల 11వ తేదీన 2850 మందికి, 12న 6108, 13న 6108, 14న 6108, 15న 6050, 16న 6008, 17న 6008, 18న 6008, 19న 6008, 20న 5997, 21న 5715, 22న 4356, 23న 1416 మంది చొప్పున ప్రత్యేక స్లాట్ల ద్వారా మౌఖిక పరీక్షలను నిర్వహించనున్నారు. వీరికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత 12 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే 2.30 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్లాట్ల కేటాయింపుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లాలో 38 మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాలే వేదికలు కానున్నాయి. అభ్యర్థులకు ఆయా మండల పరిషత్ అధికారి, తహసీల్దార్, ఈవోపీఆర్డీల బృందమే ఇంటర్వ్యూ చేయనుంది. ఇవి తప్పనిసరి ఇక ఇంటర్వ్యూలకు హాజరుకానున్న అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటి ఐడెంటిటీ కార్డును వెంట తీసుకురావాల్సి ఉంది. అలాగే కేటాయించిన స్లాట్ సమయానికి అర్ధగంట సమయం ముందు ఇంటర్వ్యూ కేంద్రానికి రావాల్సిందేనని నిబంధన విధించారు. సాక్షరతా భారత్ వంటి ప్రాజెక్టుల్లో పనిచేసి, ఉద్యోగాలను కోల్పోయిన నిరుద్యోగులకు ఈ వలంటీర్ల పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎటువంటి సిఫారసు లెటర్లు, ఇతరత్రా ఒత్తిళ్లను అనుమతించేది లేదని, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగనుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎంపికైన వలంటీర్ల జాబితాను ఆగస్టు 1వ తేదీన అధికారులు ప్రకటించనున్నారు. -
అర్బన్ వాలంటీర్ పోస్టులకు 1.20 లక్షల దరఖాస్తులు
-
స్వచ్ఛంద సేవకులు
వీపనగండ్ల : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలతో కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో పథకాలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయన్న విశ్వాసం తక్కువ. కానీ విద్యార్థులు ఐక్యమత్యంతో గ్రామాలు శుభ్రంగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని భావించి సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. స్వచ్ఛంద శ్రామికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ద్వారా ఐదు రోజులపాటు గోపల్‌దిన్నెలో శ్రమదానం చేస్తున్నారు. గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలోని వీధుల్లో చెత్తాచెదారం, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అంతేకాక మరుగుదొడ్ల నిర్మాణంతో కలిగే ఉపయోగాలు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల సేవా దృక్పథం చూసిన మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులు పలువురిలో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. యువకులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. భాగస్వాములను చేయాలి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సమాజ సేవలో భాగస్వాములను చేశాం. గ్రామాల ప్రజలు కూడా సమాజం కోసం పని చేయాలన్న దృక్పథాన్నినింపాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్యార్థుల చేత ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నాం. – లక్ష్మినారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆనందంగా ఉంది విద్యార్థులు మా గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయం. గ్రామంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. విద్యార్థుల స్ఫూర్తి తో రానున్నరోజుల్లో అభివృద్ధి పనులు చేపడతాం. – లక్ష్మిదేవమ్మ, ఎంపీటీసీ -
త్వరలో వలంటీర్ల నియామకం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: పక్షం రోజుల్లో వలంటీర్లు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్ తెలిపారు. గురువారం నారాయణఖేడ్‌లోని బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఉన్నత పాఠశాలల్లో 500 మంది వలంటీర్ల ఏర్పాటుకు, ప్రాథమిక పాఠశాలల్లో 1,500 మంది వీవీలు, ఆర్వీఎం ద్వారా తెలుగు మీడియంలో 234 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కోసం కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించి నట్లు చెప్పారు. జిల్లాలో 746 పాఠశాలల్లో సింగి ల్ టీచర్లు ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. గతంతో పోల్చితే ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడిందని అన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించేలా పేరెంట్స్ సమావేశాలను నిర్వహించాలన్నారు. టెన్త్ విద్యార్థులకు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3 నుండి ఐదారు గ్రూపులు చేసి పాఠ్యాంశాలపై క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. దీంతో జీకేతోపాటు, పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుందన్నా రు. ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని, ఈ సారి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కూడా విద్యపై ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఒత్తిడిలు, బదిలీ చేయించే ప్రయత్నాల గూర్చి ప్రస్తావించగా ని క్కచ్చిగా తన పని తాను చేసుకుపోతానని డీఈఓ తెలిపారు. సమావేశంలో ఎంఈఓ భీం సింగ్ పాల్గొన్నారు. అంతకుముందు బాలికల ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థినులను పలు పాఠ్యాంశాలపై ప్రశ్నలడిగారు. విద్యార్థులు వెంటవెంటనే సమాధానాలు చెప్పడంతో బోధనపై డీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని అసౌకర్యాలను ఈ సందర్భంగా విద్యార్థినులు డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. మినరల్‌వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తామని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా ప్రణాళికాసంఘం మాజీసభ్యుడు నగేష్ షెట్కార్‌లు గతంలో హామీనిచ్చారని విద్యార్థినులు పేర్కొనగా డీఈఓ ఎంపీతో ఫోన్లో మాట్లాడారు. త్వరలో ఏర్పాటు చేయిస్తామని ఎంపీ హామీనిచ్చారని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ భీంసింగ్, పాఠశాల హెచ్ఎం ఇందిరా కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.