న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్ వచ్చే ఏడేళ్లలో భారీగా విస్తరించనున్నట్టు ఈ రంగానికి సేవలు అందించే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ సీఎండీ మనీష్ దబ్కర తెలిపారు. 2030 నాటికి ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు (రూ.20.75 లక్షల కోట్లు) చేరుకుంటుందన్నారు. పలు కారణాల వల్ల ప్రస్తుతం ఈ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, డిమాండ్ తగ్గడంతో కార్బన్ క్రెడిట్ ధరలు 80 శాతం తగ్గినట్టు చెప్పారు.
‘‘స్వచ్ఛంద కార్బన్ ఆఫ్‌సెట్ మార్కెట్ 2021 నాటికి 2 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి క్షీణించడం వల్ల ఇప్పుడు 500 మిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అయినప్పటికీ పలు రేటింగ్ ఏజెన్సీలు కార్బన్ మార్కెట్ పుంజుకునే విషయమై సానుకూలంగా ఉన్నాయి’’అని దబ్కర వివరించారు. బార్క్‌లేస్ నివేదికను ఉదహరిస్తూ.. ‘‘పలు దేశాలు అమలు చేస్తున్న కఠినమైన పర్యావరణ అనుకూల విధానాలు, ప్యారిస్ ఒప్పందం కింద కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయంలో వాటి అంకితభావం, కార్పొరేట్ సస్టెయినబులిటీ లక్ష్యాలు అనేవి కార్బన్ క్రెడిట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది’’అని దబ్కర ఓ వార్తా సంస్థతో తెలిపారు. కార్బన్ క్రెడిట్ మార్కెట్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో మనీష్ దబ్కర తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కార్బన్ మార్కెట్‌కు కేంద్రం మద్దతు
‘‘కార్బన్ మార్కెట్‌కు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే కొంత వరకు కార్బన్ మార్కెట్ ఇక్కడ ఉంది. పునరుత్పాదక ఇంధనం కలిగి ఉన్నామంటే అది కార్బన్ క్రెడిట్ అవుతుంది. ఇంధన ఆదా సరి్టఫికెట్‌లు కూడా కార్బన్ మార్కెట్‌లో భాగమే. ఈ రెండింటినీ కలిపి కార్బన్ క్రెడిట్‌గా మార్చి విక్రయిస్తాం’’అని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లోగడ చెప్పడం గమనార్హం. ఇండోర్ కేంద్రంగా పనిచేసే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్‌లో ప్రముఖ కంపెనీగా
ఉంది.
కార్బన్ క్రెడిట్స్ మార్కెట్‌కు భారీ అవకాశాలు
Published Thu, Aug 24 2023 6:18 AM | Last Updated on Thu, Aug 24 2023 6:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment