పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ముంబై: చాలాకాలం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 82 పైసలు పెంచగా, లీటర్ డీజిల్ పై 61 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ చముర ధరల్లో చోటు చేసుకున్న స్వల మార్పులతో పెంపు అనివార్యమయ్యింది. ఈ పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు పీటీఐ పేర్కొంది.
ఈనెల ఆరంభంలో లీటరుకు రూ. 2.42, డీజిల్ ధర రూ. 2.25 తగ్గిన సంగతి తెలిసిందే. చమురు కంపెనీలు పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 63.92 నుంచి 64.74 పైసలకు చేరతుండగా, లీటర్ డీజిల్ రూ.52.13 నుంచి 52.84కు చేరనుంది.గత ఆగస్టు నుంచి చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి.