మళ్లీ తగ్గిన పెట్రో ధరలు | petrol prices are decreased | Sakshi
Sakshi News home page

మళ్లీ తగ్గిన పెట్రో ధరలు

Published Wed, Feb 4 2015 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

మళ్లీ తగ్గిన పెట్రో ధరలు

మళ్లీ తగ్గిన పెట్రో ధరలు

పెట్రోల్‌పై రూ. 2.42, డీజిల్‌పై రూ. 2.25 తగ్గింపు
 న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరల పతనంతో పెట్రోల్ ధర తాజాగా లీటరుకు రూ. 2.42, డీజిల్ ధర రూ. 2.25 తగ్గింది. తగ్గింపు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. స్థానిక పన్నుల్లో తగ్గింపునూ కలుపుకుంటే ధరలు మరికొంత తగ్గుతాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.66.39 నుంచి రూ.63.92కు, డీజిల్ ధర రూ. 54.57 నుంచి రూ.52.13కు తగ్గింది. పెట్రోల్ ధ ర ఆగస్టు నుంచి వరుసగా తగ్గడం ఇది పదోసారి కాగా, డీజిల్ ధర అక్టోబర్ నుంచి వరుసగా తగ్గడం ఆరోసారి.
 
 చమురు ధరలు తాజాగా తగ్గినా చమురు కంపెనీలకు ఇప్పటికీ లీటరు పెట్రోల్‌లోపై రూ. 4, లీటరు డీజిల్‌పై రూ. 3.6 లాభం వస్తోంది. ముడి చమురు కొనుగోలుకు, శుద్ధి చేసిన చమురు అమ్మకానికి మధ్య కాలంలో అంతర్జాతీయ విపణిలో ధరల తగ్గుదల వల్ల కంపెనీలకు వచ్చిన నిల్వల నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ లాభాలను వాడుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధర మళ్లీ తగ్గినప్పటికీ అది విమాన ఇంధనం(ఏటీఎఫ్) కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు ఏటీఎఫ్ రూ. 46.51 పలుకుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement