
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్, హైదరాబాద్ నగర కమిషనర్ మహేంద్రరెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మీనారాయణ బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.