డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్రా మార్గంలో పెద్ద ప్రమాదం జరిగింది. సోన్‌ప్రయాగ్ -గౌరీకుండ్ మధ్య మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద పలువురు కూరుకుపోయారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రక్షించింది.
ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మట్టిపెళ్లల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. పలు విపత్తుల కారణంగా యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా పరిస్థితులు కాస్త అనుకూలించడంతో యాత్ర మళ్లీ వేగం పుంజుకుంది. అయితే తాజా ఘటన తర్వాత అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉంటూ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment