'సీక్వల్లో మరింత బలంగా'
బాహుబలి సినిమా హీరో పాత్రలో పాటు అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మరో పాత్ర కట్టప్ప. తమిళ నటుడు సత్యరాజ్ పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసింది. ముఖ్యంగా క్లైమాక్స్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. కట్టప్ప పాత్రలో ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రస్తుతం దెయ్యం పాత్రలో కనిపించబోతున్నాడు.
జాక్సన్ దురై పేరుతో తమిళ్లో తెరకెక్కిన సినిమాను దొర పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో తన వారసుడు శిభిరాజ్తో కలిసి నటిస్తున్నాడు సత్యరాజ్. ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా తనకు ఎంతో పేరు తీసుకువచ్చిన కట్టప్ప పాత్ర విశేషాలను తెలియజేశాడు సత్యారాజ్. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కట్టప్ప పాత్ర మరింత బలంగా ఉంటుందన్న సత్యారజ్, త్వరలోనే తాను బాహుబలి షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు.