ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా: అవినాష్‌ | Bigg Boss 4 Telugu: Avinash Says He Have Suicidal Thoughts In Lockdown | Sakshi
Sakshi News home page

బిడ్డ శ‌వం భుజానేసుకుని వెళ్లాను: గ‌ంగ‌వ్వ‌

Published Fri, Oct 9 2020 11:23 PM | Last Updated on Sat, Oct 10 2020 4:28 PM

Bigg Boss 4 Telugu: Avinash Says He Have Suicidal Thoughts In Lockdown - Sakshi

కొద్ది రోజులుగా ఎడ‌మొహం, పెడ‌మొహం అన్న‌ట్లుగా ఉన్న అఖిల్‌, మోనాల్ క‌లిసిపోయారు. ఇంటిస‌భ్యులు వారికి జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను చెప్తూ ఎమోష‌న‌ల్ అయ్యారు. రాత్రి వ‌చ్చేసరికి మాత్రం పాటల అంత్యాక్ష‌రిలో ఎంజాయ్ చేశారు. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో మెహ‌బూబ్, అఖిల్ పోటీప‌డ్డారు. మ‌రోవైపు  బిగ్‌బాస్ ఆత్మ అవినాష్‌లోకి వ‌చ్చి ఇంటి స‌భ్యులంద‌రి గురించి చెప్పింది. మ‌రి ఆ ఆత్మ ఏం చెప్పింది? ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో ఎవ‌రు గెలిచారు? అనే విష‌యాల‌ను చ‌దివేసేయండి..

అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్‌: నోయ‌ల్‌
హౌస్‌లో ఐదో కెప్టెన్‌గా ఎన్నికైన‌ సోహైల్‌కు బిగ్‌బాస్‌ మొద‌టిరోజే ప‌రీక్ష పెట్టాడు. నీటి స‌ర‌ఫ‌రా ఆగిపోవ‌డంతో సోహైల్ త‌న ఇజ్జ‌త్ తీయొద్ద‌ని వేడుకున్నాడు. అత‌ని మొర ఆల‌కించిన బిగ్‌బాస్ వెంట‌నే నీళ్ల‌ను పంపించాడు. త‌ర్వాత మార్నింగ్ మ‌స్తీలో ఇంటిస‌భ్యులంద‌రూ మ‌న‌సులో ఉండిపోయిన‌ త‌మ సందేశాల‌ను తెలియ‌జేయాల్సి ఉంటుంద‌న్నాడు. అందులో భాగంగా నోయ‌ల్ త‌న అమ్మ గురించి చెప్పుకొచ్చాడు. 207 ఎముక‌లు విర‌గ్గొడితే ఎంత నొప్పి ఉంటుందో పురిటి నొప్పి అంత తీవ్రంగా ఉంటుంద‌ని వివ‌రించాడు. అందుకే త‌న కాలి నొప్పిని నేను టాస్కులో ఎప్పుడూ లెక్క‌చేయ‌లేద‌న్నాడు. త‌న బెస్ట్ ఫ్రెండ్ అమ్మ‌ అని, త‌న‌ను త‌ల ఎత్తుకునేలా చేస్తాన‌ని స‌గ‌ర్వ‌గా ప్ర‌క‌టించాడు. దీంతో లాస్యకు జున్ను గుర్తొచ్చి క‌న్నీళ్లు పెట్టుకుంది. (చ‌ద‌వండి: అతిథుల టార్చర్‌.. కుప్పకూలిన అభి)

ఇంటి కోసం అప్పు చేశాను: అవినాష్
అవినాష్ మాట్లాడుతూ.. "నేను పేరెంట్స్‌, ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే న‌మ్ముతా. లాక్‌డౌన్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌నుకున్నా. ఎందుకంటే ఇల్లు కొన్నాను, కానీ ఈఎమ్ఐ క‌ట్ట‌లేక‌పోయాను. ఎందుకంటే అదే స‌మ‌యంలో నాన్నకు గుండెపోటు వ‌చ్చింది. మూడు స్టంట్లు వేయ‌డానికి ఇంటి కోసం ఉంచిన‌ 4 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాను. అమ్మ‌కు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించాను. దీంతో ఇంటి అప్పు తీర్చేందుకు బ‌య‌ట అప్పు చేశాను. కానీ ఇదంతా నా పేరెంట్స్ కోస‌మే చేశాను. వాళ్లు పోయిన‌ప్పుడు బాధ‌ప‌డ‌కుండా ఉన్న‌ప్పుడే వారికి గౌర‌వం ఇవ్వండి. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్ట‌కండి. వాళ్ల‌తో క‌లిసి ఉండండి అని కోరుతూ ఓ మంచి సందేశాన్ని వినిపించాడు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న అవినాష్‌పై మాస్ట‌ర్‌ మండిప‌డ్డాడు. తాను రూ.6 కోట్ల ఇల్లు క‌ట్టాను, కానీ అమ్మేశాను, క‌ష్టాలు అలా ఉంటాయి అని స‌ముదాయించాడు.

బిడ్డ శ‌వం ఎత్తుకుని వెళ్తే బ‌స్సెక్క‌నియ్య‌లే
త‌ర్వాత గంగ‌వ్వ మాట్లాడుతూ.. "ఐదేళ్ల‌ప్పుడే పెళ్లి. 17 ఏళ్ల‌కే కొడుకు. ఇంకో రెండేళ్ల‌కే కూతురు పుట్టింది. తాగి కొట్టే భ‌ర్త విదేశాల‌కు పోయిండు. ఓ రోజు నా కూతురుకు ఫిట్స్ రావ‌డంతో ఆమెను ఎత్తుకుని న‌డ‌క ప్రారంభించాను. అప్పుడు ఊర్లోకి బ‌స్సు వ‌చ్చేది కాదు. కానీ ఊరి నుంచి వెళ్లే ఓ బండి న‌న్ను చూసి ఎక్కించుకుంది. అలా జగిత్యాల ఆస్ప‌త్రికి వెళ్లాను. అక్క‌డ ఆమె చ‌నిపోయింద‌ని చెప్ప‌గానే బిడ్డ‌ను ఎత్తుకుని వెనుదిరిగాను. బ‌స్ ఎక్క‌బోతే శ‌వంతోని లోప‌లకు రానీయ‌లేదు. ఆటోలో ఇంటికి వెళ్లాను" అని ఏడ్చేసింది. త‌ర్వాత మ‌ళ్లీ అన్నం తిన‌లేక‌పోతున్నాన‌ని గంగ‌వ్వ క‌న్నీళ్లు పెట్టుకుంది. (చ‌ద‌వండి: బిగ్‌ బాస్‌ : సీక్రెట్‌ టాస్క్‌ అవినాష్‌ కొంప ముంచేనా?)

ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో గెలుపొందిన మెహ‌బూబ్‌
బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు లగ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్‌, మెహ‌బూబ్ పోటాపోటీగా ఆడారు. త‌ర్వాత గెలిచిన మెహ‌బూబ్ మోనాల్‌తో మ‌సాజ్ చేయించుకున్నాడు. ఇక అఖిల్ కొద్దిరోజులుగా దూరం పెట్టిన మోనాల్‌తో మాట్లాడి ఆమెను కూల్ చేశాడు. కానీ దేవుడి మీద న‌మ్మ‌కం ఉంది గానీ నీ మీద లేద‌ని మోనాల్‌ మొహం మీదే చెప్పేశాడు. బిగ్‌బాస్ ఈసారి ఓ క్రేజీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని, అత‌ని ఆత్మ‌ను ర‌ప్పించాల‌ని చెప్పాడు. ఆ ఆత్మ అవినాష్ శ‌రీరంలోకి వ‌స్తుంద‌ని తెలిపాడు. వెంట‌నే ఇంటి స‌భ్యులంద‌రూ బిగ్‌బాస్ ఆవాహ‌యామి అంటూ చేతులు ప‌ట్టుకుని వ‌ల‌యాకారంలో అవినాష్ చుట్టూ తిరిగారు. వెంట‌నే ఉరుములు, మెరుపుల‌తో బిగ్‌బాస్ ఆత్మ అవినాష్ శ‌రీరంలోకి వ‌చ్చింది. అత‌డు ఇంటి స‌భ్యులు ఒక్కొక్క‌‌రి గురించి వివ‌రంగా చెప్పాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: గంగ‌వ్వ భ‌జ‌న చూడ‌లేక‌..)

ఐ ల‌వ్ యూ : దివి
నోయ‌ల్‌ను కుంట‌డం మానేయ‌మ‌ని, సుజాత‌ను చిన్న చిన్న విష‌యాల‌కు అల‌గ‌డం మానేయాల‌ని చెప్పాడు. మోనాల్ తెలుగులో చ‌క్క‌గా మాట్లాడుతుంద‌ని మెచ్చుకున్నాడు. ఇక గంగ‌వ్వ మాత్రం అవినాష్‌(బిగ్‌బాస్‌)కు ఓ కోడిని కోసి పెడ‌తా, ఇంటికి రా అని చెప్పింది. త‌ర్వాత‌ సోహైల్‌ను గట్టిగా మాట్లాడ‌టం త‌గ్గించండ‌ని చెప్పాడు. దివి బిగ్‌బాస్‌కు ఐ ల‌వ్ యూ చెప్ప‌డంతో కాసేపు మెలిక‌లు తిరిగాడు. మెహ‌బూబ్ బాగా ఆడుతున్నాడ‌ని, కానీ కోపానికి వ‌స్తున్నార‌ని అన్నాడు. హారిక ముద్దుల‌తో సైగ‌లు ఇవ్వ‌గా అవినాష్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక‌ హోట‌ల్ టాస్క్‌లో అవినాష్‌ను బాగా టార్చ‌ర్ పెట్టావ‌ని అరియానాను తిడుతూనే, ముక్కుసూటి మ‌నిషి అని మెచ్చుకున్నాడు. ఈ వ‌య‌సులో కూడా బాగా ఆడుతున్నాడ‌ని మాస్ట‌ర్‌పై సెటైర్ వేశాడు. అనంత‌రం మ‌ళ్లీ మెరుపుల‌తో బిగ్‌బాస్ ఆత్మ అవినాష్ నుంచి వెళ్లిపోయింది. 

మోనాల్‌కు దివి, మాస్ట‌ర్ స‌ల‌హాలు
త‌ర్వాత గంగ‌వ్వ‌తో ముచ్చ‌ట్లు పెట్టుకుంటుంటే మ‌ధ్య‌లో వ‌చ్చినందుకు అవినాష్‌ను సుజాత ఒక్క‌టిచ్చింది. రాత్రి ఇంట్లో అంత్యాక్ష‌రి జ‌రిగింది. మాస్ట‌ర్‌, అవినాష్, అరియానా, సోహైల్ పాట‌లు పాడాడు. ఈ పాట‌ల పోటీ ముగిశాక దివి మోనాల్‌కు కొన్ని సూచ‌న‌లు చేసింది. మోనాల్‌కు నేనంటే ఇష్ట‌మ‌ని ఇద్ద‌రు అబ్బాయిలు(అభిజిత్‌, అఖిల్‌) ఫీల్ అవుతున్నారు అని ఆమె చెవిన వేసింది. నేన‌లా చెప్ప‌లేద‌ని, నా పేరు వాడొద్ద‌ని మాత్ర‌మే చెప్పాన‌ని మోనాల్ తెలిపింది. అఖిల్‌తో ఉంటే ఏం కాదు కానీ, అభిజిత్‌తో ఉండొద్ద‌ని మాస్ట‌ర్ ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. ఇద్ద‌రూ జెన్యూన్‌, నువ్వే వాళ్ల‌కు క్లారిటీ ఇవ్వు అని దివి చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement