‌అఖిల్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఏంటి? | Bigg Boss 4 Telugu: Akhil Sarthak Got Special Surprice From Biss Boss | Sakshi
Sakshi News home page

అఖిల్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న బిగ్‌బాస్

Oct 2 2020 3:21 PM | Updated on Oct 2 2020 7:36 PM

Bigg Boss 4 Telugu: Akhil Sarthak Got Special Surprice From Biss Boss - Sakshi

బిగ్‌బాస్‌లో గురువారం నాడు ఎడిపోడ్‌లో కొనసాగిన కాయిన్స్‌ టాస్క్‌లో అనేక ట్విస్ట్‌లతో కొత్త ఇంటి కెప్టెన్‌గా కుమార్‌ సాయి ఎన్నికవ్వడంతో ఇంటి సభ్యూలంతా ఆశ్యర్యంలో మునిగితేలారు. సుజాత, మాస్టర్, కుమార్ సాయి, హారిక అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్‌లోకి రావడం వీరిలో ఎవరూ ఊహించని విధంగా కుమాన్‌ కెప్టెన్‌ బ్యాండ్‌ స్వీకరించడంతో ఇంట్లో వారికి షాక్‌ తగిలినట్లు అయ్యింది. ఈ రోజుతో గంగవ్వ కెప్టెన్సీ కాలం ముగియడంతో రేపటి నుంచి కుమార్‌ బిగ్‌బాస్‌ ఇంటిలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అంతేగాక కెప్టెన్‌ అయ్యనందున ఎలిమినేషన్‌కు నుంచి కూడా తప్పిచుకున్నాడు. చదవండి: భవిష్యవాణి చెప్పిన గంగవ్వ

ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ అఖిల్‌ను‌ మాత్రమే కన్ఫేషన్‌ రూమ్‌కు పిలిపించాడు. అక్కడికి వెళ్లిన అఖిల్‌ను ఇంటి సభ్యులంతా టీవీలో చూస్తున్నారు. అయితే కన్ఫేషన్‌ రూమ్‌కు రప్పించిన అఖిల్‌కు బిగ్‌బాస్‌ ఏదో ప్రత్యేకమైన టాస్క్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు ఏదో ప్రత్యేక అవకాశం లేదా అధికారం ఇచ్చినట్లు కన్పిస్తోంది. కాగా ఏ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడో ఖచ్చితంగా తెలియదు కానీ తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తుంటే ఇంట్లోని మిగతా కంటెస్టెంట్లకు ఎసరు పెట్టేలా కన్పిస్తోంది. వెంటనే నోయల్‌, అరియానా, మాస్టర్‌ ఏదో పోగోట్లుకున్నట్లు నో వద్దు అంటూ అరిచారు. అసలు బిగ్‌బాస్‌ అఖిల్‌కు ఏ టాస్క్‌/సర్‌ప్రైజ్‌ ఇచ్చాడో తెలియాలంటే ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే బిగ్‌బాస్‌పైనే ఓ కన్నేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement