బిగ్‌బాస్‌: మాస్టర్‌ కాళ్లు పట్టుకున్న సోహైల్‌ | Bigg Boss 4 Telugu: Sohail Asks Apology To Master With Touching Legs | Sakshi
Sakshi News home page

సోహైల్‌తో జీవితంలో మాట్లాడను: మాస్టర్‌

Published Thu, Oct 1 2020 10:40 PM | Last Updated on Fri, Oct 2 2020 3:39 AM

Bigg Boss 4 Telugu: Sohail Asks Apology To Master With Touching Legs - Sakshi

గత మూడు సీజన్‌లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో మరో మెట్టు ఎక్కువ వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తోంది. విభిన్న టాస్క్‌లతో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తోంది. ఇప్పటికే 24 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకొని 25వ రోజులోకి అడుగుపెట్టింది. గురువారం కూడా కాయిన్ల టాస్క్‌ కొనసాగింది. మాస్టర్‌పై అరిచినందుకు సోహైల్‌ తన దగ్గరకు వచ్చి మాస్టర్‌ కాళ్లు పట్టుకున్నారు. స్విచ్‌ కాయిన్‌ ద్వారా సుజాతకు ఊహించని వరం లభించింది. సోహైల్‌పై మాస్టర్‌ విరుచుకుపడగా ఎవరూ ఊహించని వ్యక్తి ఇంటి కెప్టెన్‌ అయ్యాడు.  ఇంకా ఈ రోజు ఏం జరిగిందంటే.. 

అరియానాపై సుజాత ఫైర్‌
లాస్య, అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతుండగా.. సోహైల్‌ వచ్చి మాస్టర్‌ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాడు. మాస్టర్‌ నుంచి కాయిన్లు దొంగిలించిన కారణంగా తను ఇలా క్షమాపణలు కోరాడు. .. తన పక్కన కూర్చొబెట్టి బుజ్జగించాడు. తన మీద కోపం లేదని, ఏదో కోపంలో అలా చేశానని సంజాయిషీ చెప్పుకున్నాడు. నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్‌ అని మాస్టర్‌ సోహైల్‌కు హితబోధన చేశాడు. అందరూ రిలాక్స్‌ అయిపోవడంతో బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను హెచ్చరించాడు.. ఆటను కొనసాగించాలని ఆదేశించాడు. తిరిగి ఆటను కొనసాగించారు. కిల్లర్‌ కాయిన్స్‌ రెండో భాగంలో దివి, అరియానా, సోహైల్‌, నోయల్‌, మాస్టర్‌ అవుట్‌ అవ్వడంతో తప్పుకున్నాడు. ఎక్కువ పాయింట్లు ఉన్న వారిని టార్గెట్‌ చేయాలని అరియానా చెప్పడంతో ఆమెపై సుజాత ఫైర్‌ అయ్యింది. నువ్వు రన్నింగ్‌ కామెంట్‌ ఇవ్వొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో లెవల్‌ పూర్తయింది. ఓవైపు అరియానా, సుజాత గొడవ పడుతుండగా.. మరోవైపు అఖిల్‌, మాస్టర్‌ మధ్య వాదన మొదలైంది. అమ్మాయిల మాదరి ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడని మాస్టర్‌ మండిపడ్డారు.  చదవండి : బిగ్‌బాస్‌: అందరి కన్ను సోహైల్‌ పైనే

అనంతరం మూడో లెవల్‌ ప్రారంభమైంది. ఇదే అఖరిది కూడా. ఆ లెవల్‌లో ఆఖరు బజర్‌ మోగేలోపు ఇంటి సభ్యులు అందరూ సామా, భేద,దాన, దండోపాయాలు ఉపయోగించి తమ దగ్గర ఉన్న కాయిన్ల విలువను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అవినాష్‌కు కాయిన్లు పట్టకునేందుకు అరియానా సాయం చేసింది. లాస్చ, మాస్టర్‌కు కాయిన్లు ఇచ్చేసింది. అవినాష్‌వి కూడా మాస్టర్‌కు ఇచ్చేసింది. సోహైల్‌, మెహబూబ్‌కు ఇచ్చేశాడు. తన దగ్గర తీసుకున్న కాయిన్లనను తనకు ఇచ్చేయమని మాస్టర్‌, సోహైల్‌ను అడిగాడు.  లేకుండే తన మనసు కుదుటపడదని వాపోయాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్‌కు కాయిన్లు ఇవ్వకంటూ మెహబూబ్‌  సోహైల్‌కు నూరిపోశాడు. (బిగ్‌బాస్‌: కాసుల వేటలో గెలుపెవరిది!)

తర్వాత ఇంటి సభ్యులంతా తమ దగ్గర ఉన్న కాయిన్లను లెక్కించి బిగ్‌బాస్‌కు చెప్పారు. అఖిల్‌, మోనాల్‌, సోహైల్‌ తమ పాయింట్లను మెహబూబ్‌కు ఇచ్చేశారు. ఇప్పడు సుజాత దగ్గర ఉన్న స్విచ్‌ కాయిన్‌ను ఉపయోగించి.. వేరే వాళ్ల కాయిన్లతో స్విచ్‌ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని  వాడుకొని సుజాత, మెహబూబ్‌ పాయింట్లను లాగేసుకుంది. చివరకు ఎక్కు పాయింట్లు ఉన్న కారణంగా సుజాత, అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌, కుమార్‌ సాయి, అలేఖ్య హారిక నలుగరు కెప్టెన్‌ పోటీదారులుగా ఎన్నికయ్యారు. తన పాయింట్లు పోవడంతో మెహబూబ్‌ కన్నిటీ పర్యంతమయ్యాడు. కష్టపడి ఆడిన తనకు అన్యాయ జరిగిందని ఆవేదన చెందాడు. అక్కడితో ఆ టాస్క్‌ ముగియడంతో హారిక, అభి, దివి జరిగిన దాని గురించి చర్చించుకున్నారు. (బిగ్‌బాస్‌: టాస్క్‌లో ప‌డిపోయిన అవినాష్‌)

మాస్టర్‌తో మాట్లాడాలని సోహైల్‌ కోరితే అందుకే మాస్టర్‌ ససేమిరా అన్నాడు. తన కాయిన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన సోహైల్‌ ఉపయోగించుకోలేదని రాజశేఖర్‌ మాస్టర్‌ అనగా.. గేమ్‌ను గేమ్‌ లానే ఆడానని, అస్సలు  క్షమాపణలు చెప్పనని సోహైల్‌ తెగేసి చెప్పాడు. దీంతో తనతో జీవితంలో మాట్లాడనని మాస్టర్‌ శపథం చేశాడు. అనంతరం నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు కాసుల వేట టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా గార్డెనింగ్‌ ఏరియాలో మట్టితో బురద గొయ్యి ఏర్పాటు చేసి అందులో కొన్ని కాయిన్లు పెట్టి ఉంచారు. బురదలోని కాయిన్లనుంచి టాస్క్‌ ముగిసే సమయానికి ఎవరి బాస్కెట్‌లో ఎక్కవ కాయిన్లు ఉంటే వారు ఇంటి కెప్టెన్‌ అవ్వనున్నారు. ఈ టాస్క్‌ సంచాలకులుగా సోహైల్‌ ఉన్నాడు. ఈ టాస్క్‌లో నలుగురు పోటీపడి మరి పోరాడారు.

ఈ టాస్స్‌లో ఎవరూ ఊహించని విధంగా 100 పాయింట్ల అధిక్యతతో కుమార్‌ నాలుగో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం కెప్టెన్‌ బ్యాండ్‌ను ధరించాడు. గార్డెన్‌లో కూర్చొని ఉల్లాసంగా గడిపారు. అరియానుకు పిచ్చి పట్టింది. కానీ తనకు ఇప్పడే తెలిసిందని మాస్టర్‌ చెప్పాడు. ఇక స్వాతి, అఖిల్‌ మాట్లాడుకుంటుండగా.. అవినాష్‌ వారి సంభాషణలకు దూరం నుంచి ఫన్నీగా వాయిస్‌ ఇచ్చాడు. అలాగే గంగవ్వ అమ్మ వారు సోకితే ఎలా మాట్లాడతారో నటించి చూపిస్తూ ఇంటి సభ్యులకు వినోదాన్ని అందించింది. దీనంగా చూస్తున్న హారికను అభి ఆకస్మాత్తుగా వచ్చి భయపెట్టాడు. తర్వాత తనను వెనకనుంచి వచ్చి పట్టుకొని కూల్‌ చేశాడు. (క‌థ వేరే ఉంట‌ది: మాస్ట‌ర్‌కు సోహైల్ వార్నింగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement