గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోను: దేవి | Bigg Boss 4 Telugu: Noel Sean Selected As Second Captain | Sakshi
Sakshi News home page

టాస్క్‌లో ఓడిన మాస్ట‌ర్‌, రెండో కెప్టెన్‌గా నోయ‌ల్‌

Published Fri, Sep 18 2020 11:00 PM | Last Updated on Sat, Sep 19 2020 2:44 PM

Bigg Boss 4 Telugu: Noel Sean Selected As Second Captain - Sakshi

ఇన్నాళ్ల‌కు బిగ్‌బాస్ తానున్నానంటూ ఉనికి చాటుకున్నాడు. ఇంటి నియ‌మ నిబంధ‌న‌లు పాటించ‌నందుకు ఇంటి స‌భ్యులంద‌రినీ శిక్షించాడు. మ‌రోవైపు బీబీ టీవీ సాగ‌దీత‌గా మారింది. మొద‌ట‌ సీరియ‌ల్ ఎపిసోడ్‌, త‌ర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్, నేడు కామెడీ షో నిర్వ‌హించారు. జ‌బ‌ర్ద‌స్త్‌ను గుర్తు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో అవినాష్‌, సాయి కుమార్ రెండు టీమ్‌లుగా విడిపోయి నువ్వానేనా అన్న రీతిలో కామెడీ పండించారు. నేటి ఎపిసోడ్‌లో ఇంకేమేం జ‌రిగాయో చ‌దివేయండి..

టాస్క్ ఓడిపోవ‌డంతో హ‌ర్టైన‌ మాస్ట‌ర్‌, కూల్ చేసిన బిగ్‌బాస్‌
సాయి కుమార్ డ్రామా స్కిట్‌, అవినాష్ సినిమా స్కిట్ వేశారు. ఈ రెండు టీమ్‌ల‌కు స‌మాన ఓట్లు ప‌డ‌గా చివ‌ర‌గా గంగ‌వ్వ వేసిన‌ ఒక్క ఓటుతో అవినాష్ టీమ్ గెలిచింది. దీంతో సాయి కుమార్ టీమ్‌లోని మాస్ట‌ర్ కాస్త హ‌ర్ట‌య్యాడు. కానీ రెండు గ్రూపులు గెలిచాయ‌న్న‌దానికి సంకేతంగా బిగ్‌బాస్‌ రెండు రీల్ జ్యూస్ బాటిల్స్‌ పంపించ‌డంతో ఇంటి స‌భ్యులు టైటిల్ గెలిచినంత ఆనందంగా ఫీలయ్యారు. త‌ర్వాత దేవి త‌న‌ను కాస్త దూరం పెడుతున్నార‌ని హ‌ర్ట్ అయింది. మీరందరూ ఏదో మాట్లాడుకుని కావాల‌ని త‌న‌ను ఇలా చేస్తున్నార‌ని అంద‌రిపై అనుమానం వ్య‌క్తం చేసింది. అలాంటిదేం లేద‌ని లాస్య ఎంత‌ చెప్పినా ఆమె చెవికెక్కించుకోలేదు. (బిగ్‌బాస్‌: టీఆర్పీలో స‌రికొత్త రికార్డు)

బిగ్‌బాస్‌తో స‌హా అంద‌రూ సారీ చెప్పాలి
మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌, నోయ‌ల్‌, హారిక తెలుగులో కాకుండా అన్య‌భాష‌ల్లో మాట్లాడుతున్నార‌ని బిగ్‌బాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుకు శిక్ష‌గా వారంద‌రూ బోర్డు మీద బిగ్‌బాస్ మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి అని రాసుకొచ్చారు. ఏదైనా టాస్క్ కోసం పిలిచిన‌ప్పుడు ఇంటి స‌భ్యులు ఆల‌స్యంగా వ‌స్తున్నార‌ని బిగ్‌బాస్ తెలిపాడు. దీనికి శిక్ష‌గా బెల్ కొట్టిన ప్ర‌తీసారి ఇంటి స‌భ్యులు ప‌రుగున ఒక‌చోటికి చేరి 20 గుంజీలు తీశారు. అయితే నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ప్ర‌తిసారి లాస్య త‌న వ‌స్తువును వ‌దిలేసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించాడు. (బిగ్‌బాస్‌లో నా వాయిస్‌, సంతోషంగా ఉంది: నందు)

కెప్టెన్‌గా నోయ‌ల్ ఏక‌గ్రీవం
త‌ర్వాత సుజాత చిట్టి చిల‌క‌మ్మ ప‌ద్యం చెప్పే కొద్దీ మోనాల్ ముద్దుముద్దుగా పలుకుతూ నేర్చుకుంది. మ‌రోవైపు చిన్న చిన్న విష‌యాల‌కు తెగ ఫ్ర‌స్టేట్ అవుతున్న నోయ‌ల్‌ త‌నకు బిగ్‌బాస్‌తో స‌హా చాలా మంది సారీ చెప్పాలన్నాడు. ఈ శ‌నివారం నాగ్‌ను అడిగి వెళ్లిపోతాన‌న్నాడు. త‌ర్వాత‌‌ కొద్ది గంట‌ల‌కే శిక్షాకాలం ముగిసిన‌ట్లు బిగ్‌బాస్‌ ప్ర‌క‌టించాడు. ఈ వారం లగ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ బీబీ టీవీ విజ‌య‌వంతంగా పూర్తి చేశార‌ని అభినందించాడు. అనంత‌రం కెప్టెన్సీ కోసం నోయ‌ల్‌, మెహ‌బూబ్‌, క‌ళ్యాణి, అభిజిత్‌ పోటీ ప‌డ్డారు. అందరూ ఏకాభిప్రాయంతో నోయ‌ల్‌ను రెండో కెప్టెన్‌గా ఎన్నుకున్నారు.

అమ్మ రాజ‌శేఖ‌ర్ వ‌ర్సెస్ దేవి నాగ‌వ‌ల్లి
ఎవ‌రు ఏ ప‌ని చేయాల‌న్న విష‌యంలో దేవి, అమ్మ రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చాయి. గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోన‌ని దేవి క‌రాఖండిగా చెప్పేసింది. దీంతో ఖంగు తిన్న మాస్ట‌ర్ నీ వాయిస్ పెరిగితే  ఏం లేదు, కానీ నా వాయిస్ పెరిగితే మాత్రం త‌ప్పొచ్చిందా? అని అస‌హ‌నానికి లోన‌య్యాడు. అలా ఇద్ద‌రి మ‌ధ్య కాస్త ర‌భ‌స‌ జ‌రగ‌డంతో నోయ‌ల్ స‌ర్ది చెప్పాడు. ఆ త‌ర్వాత అవినాష్..‌ మోనాల్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో చేసి చూపించ‌డంతో ఆమె హ‌ర్ట్ అయింది. దీంతో అవినాష్ ఆమె ద‌గ్గ‌రికి వెళ్లి క్ష‌మించ‌మ‌ని కోరాడు. (నోయ‌ల్‌ను ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement