
ర్యాప్ సింగర్ నోయెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ర్యాపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోయెల్ సింగర్‌గానే కాకుండా నటుడిగానూ పలు సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో కంటెస్టెంట్‌గానూ పాల్గొని అలరించాడు. అయితే నోయెల్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి శనివారం రాత్రి కన్నుమూశారు.
ఈ విషయం తెలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా నోయెల్‌కు తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పంచుకున్న పలు సరదా వీడియోలను నోయెల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తండ్రి మరణంతో నోయెల్ కుంగిపోయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment