
నోయల్ మొదట సింగర్‌గానే పరిచయమైనప్పటికీ ఆ తర్వాత తనలోని నటనా కోణాన్ని కూడా బయటపెట్టాడు. ఇతను అందరికీ సుపరిచితుడే. ది షేక్ గ్రూప్ పేరుతో ఓ తెలుగు బ్యాండ్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. 2019లో ఎస్తర్ నోరోన్హాను వివాహం చేసుకున్న నోయల్ కొద్ది రోజుల క్రితమే విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. కాగా బయట ఎలా ఉంటానో తన ఫ్యామిలీకి తెలియజేసేందుకే బిగ్‌బాస్‌కు వచ్చానంటున్నాడు. రావడంతోనే బిగ్‌బాస్ షోపై ఓ ర్యాప్ సాంగ్ పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇది బిగ్‌బాస్‌కు ఎంత నచ్చిందో తెలీదు కానీ, ప్రేక్షకులు మాత్రం బాగుందంటూ నోయల్‌తో మరింత కనెక్ట్ అయిపోయారు. అటు సింగర్‌గా, ఇటు నటుడిగా రాణిస్తున్న నోయల్ హౌస్‌లో కంటెస్టెంట్ల పోటీని తట్టుకుని ఎక్కడివరకు ప్రయాణం సాగిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment