నేడు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ వారి జీవితాలను కుదిపేసిన సంఘటనలను గురించి చెప్తూ విషాదంలో మునిగిపోయారు. తమతమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఓసారి జీవితంలోకి వెనుదిరిగి చూసుకున్నారు. ఈ క్రమంలో వారు కోల్పోయినవి, సంపాదించుకున్నవి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలా ప్రతీఒక్కరూ వారి వారి సంఘటనలను చెప్తూ ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. ఎవరు ఏయే విషయాలను పంచుకున్నారో చదివేయండి..
అరియానాకు సారీ చెప్పి తినిపించిన సోహైల్
మోనాల్ అవినాష్‌కు గోరు ముద్దలు తినిపిస్తే అతడు మాత్రం అరియానాకు తినిపించాలని తహతహలాడాడు. అటువైపేమో తన ఫ్రెండ్స్ లిస్టులో లేదన్న అరియానాకు సోహైల్ సారీ చెప్తూ నూడుల్స్ తినిపించాడు. దీంతో అవినాష్ తినిపించబోతే వద్దని వారించింది. 'అతడు పెడితే తింటావు, కానీ నేను పెడితే తినవు కదా' అని అవినాష్ నిలదీయడంతో మారు మాట్లాడలేక తినేసింది. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ ఫూల్‌లోని బాటిల్స్ తీసుకుని ఎత్తిన బాటిల్ దించకుండా తాగాలి. ఇందులో ఇందులో మెహబూబ్ ఏడు బాటిల్స్ తాగేయగా కుమార్ ఆరింటిని తాగి టాస్క్ విజయవంతంగా పూర్తి చేశారు. తర్వాత అందరూ కలిసి పిచ్చి పట్టినవాళ్లలా అరిచారు. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత)
మా అమ్మానాన్న విడిపోయారు: అరియానా
ఇంటి సభ్యులందరి చిన్ననాటి ఫొటోలను బిగ్‌బాస్ టీవీలో చూపించడంతో కంటెస్టెంట్లు ఎగ్జైట్ అవుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత అందరికీ ఫొటోఫ్రేములను పంపించగా వారిని కదిలించిన స్టోరీలను చెప్పుకొచ్చారు. అరియానా తన అసలు పేరు అర్చన అని తెలిపింది. కానీ ఇది ఎవరికీ చెప్తాననుకోలేదని అంది. "మా అమ్మానాన్న లవ్ మ్యారేజ్. నేను కడుపులో ఉన్నప్పుడు విడిపోయారు. అమ్మ ఒక్కతే నన్ను, అక్కని పెంచింది. నాలుగు వేల జీతానికి యాంకరింగ్ చేశా. ఐదు వందలకు కూడా ఈవెంట్స్ చేశా. అలా అర్చన నుంచి అరియానాగా మారి ఇక్కడి వరకు వచ్చాను" అని చెప్పుకొచ్చింది. తన కుటుంబం అంటే ఇష్టమని చెప్పిన మోనాల్ బిగ్‌బాస్ తర్వాత ఇంకా ఎన్నో కుటుంబాలు తనకోసం ఉన్నాయని తెలిపింది. (చదవండి: నేను లేకపోతే ఏమైపోతావో: అవినాష్)
సింగరేణి ముద్దుబిడ్డ బిగ్‌బాస్‌కు వచ్చిండు
"సింగరేణిలో మా నాన్న పని చేస్తాడు. ఓసారి అండర్‌గ్రౌండ్‌లో తల మీద రాయి పడింది. దాని ప్రభావం ఈ మధ్య బయటపడింది. ఆయనకు తలలో రక్తం గడ్డకట్టింది. అంతకుముందే రోడ్డు ప్రమాదంలో ఒక కిడ్నీ పోయింది. అయినా ఉద్యోగం చేస్తూ మా ఐదుగురిని పెంచి పోషించాడు. నాన్నంటే నాకు చాలా ఇష్టం. సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహైల్ బిగ్‌బాస్‌కు వచ్చిండని మా నాన్న హ్యాపీగా ఫీలవుతాడు" అని సోహైల్ సంతోషించాడు. "మాది అద్దె ఇల్లు. తమ్ముడు కూరగాయలు అమ్మేవాడు. తల్లిదండ్రులు, తమ్ముడు నాకోసం కష్టపడేవారు. వాళ్లు బాగుంటే నాకంతే చాలు" అంటూ మెహబూబ్ భావోద్వేగానికి లోనయ్యాడు.
అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేది: నోయల్
"నేను అమ్మతో క్లోజ్‌గా ఉంటాను. ఉన్న ఆస్తినంతా నాకిచ్చేస్తానని అమ్మ చెప్పింది. దీంతో అందరూ నాకు అమ్మను దూరం చేశారు. అమ్మకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాను. బతకడం కష్టమన్నారు. డబ్బు ఇచ్చి అమ్మను రెండేళ్లపాటు కాపాడుకున్నాను. డబ్బు ఎప్పుడైనా వస్తుంది, కానీ మనుషులను మిస్ అవ్వద్దు 'అని మాస్టర్ అందరికీ మంచి సందేశం ఇచ్చాడు. "అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేది. నాన్న చిరంజీవి ఫ్యాన్. నేను మొదటిసారి 'ఈగ' సినిమాలో కనిపించా. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాన్నను తీసుకుని థియేటర్‌కు వెళ్లాను. అందరూ నాతో ఫొటోలు దిగుతుంటే నాన్న షాకయ్యారు. కానీ తర్వాత నాన్నతో నేను సెల్ఫీ దిగాను" అని నోయల్ తెలిపాడు. (చదవండి: గంగవ్వలాగే నన్ను పంపించేయండి: నోయల్)
నాన్న పేరు కూడా మర్చిపోయా: హారిక
"అది నా ఇంటర్మీడియట్. అమ్మమ్మ ఇంటికి రమ్మంటే వెళ్లాను. అక్కడ మా అమ్మానాన్న విడిపోతున్నారని చెప్పారు. నాన్న దగ్గర ఉండమన్నారు. అమ్మ మాత్రం ఖాళీ బ్యాగుతో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒకరోజు నేను, అన్న అమ్మ దగ్గరకు వెళ్లిపోయాం. అలా ఐదు సంవత్సరాలుగా నాన్నకు చాలా దూరమొచ్చేశాను. ఓ సారైతే ఆయన పేరు కూడా గుర్తు రాలేదు. నాన్న.. మేమెప్పుడూ తిరిగి చూడలేదు, మీరెప్పుడు తిరిగి చూడలేదు. తిరిగి చూసినరోజు మేం ఆగిపోతాం. అందుకే మేం తిరగం. కానీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. అమ్మా.. నువ్వు లేని రోజు నేను లేను, నాన్న లేని లోటు అన్న తీర్చాడు, అతడు నా వెన్నెముక" అని హారిక ఎమోషనల్ అయింది.
కిచెన్‌లో దొంగలు పడ్డారు
రాత్రి పూట కిచెన్‌లో దొంగలు పడ్డారు. హారిక, లాస్య పిస్తాలు దొంగతనం చేసి తినేశారు. తర్వాత వాటితో గవ్వలాట ఆడారు. అయితే వీరిని దూరం నుంచి చూసిన అఖిల్ ఒక్కసారిగా భయపెట్టాడు. తర్వాత ఈ ముగ్గురినీ నోయల్ భయపెట్టాడు. అంతా కలిసి అక్కడి వస్తువులను లాగించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విషయం కనిపెట్టిన దివి కూడా ఆ గ్యాంగ్‌లో చేరి దొరికినంత తినేసింది. (చదవండి: సుజాత ఎలిమినేట్, 'పోకిరీ'పై ప్రతీకారం)
Comments
Please login to add a commentAdd a comment