Panchatantra Kathalu OTT Release Date Out - Sakshi
Sakshi News home page

Panchatantra Kathalu: ఓటీటీలో నోయల్‌ పంచతంత్ర కథలు, ఎప్పటినుంచంటే?

Published Sat, Aug 27 2022 9:10 PM | Last Updated on Sat, Aug 27 2022 9:21 PM

Panchatantra Kathalu OTT Release Date Out - Sakshi

బాల్యంలో చదువుకున్న పంచతంత్ర కథల ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కిన ఆంథాలజీ మూవీ పంచతంత్ర కథలు. నోయల్‌, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ దర్శకత్వం వహించగా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు.

ఇందులో అడకత్తెర, అహల్య, హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌, నర్తనశాల, అనగనగా అని ఐదు కథలు ఉంటాయి. వాటి సమాహారమే ఈ సినిమా. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఆగస్టు 31 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఆహా అనిపించిన అనౌన్స్‌మెంట్‌ ఇది అంటూ నోయల్‌ సోషల్‌ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

చదవండి: బాలీవుడ్‌లో నా స్నేహితులే నన్ను పక్కన పెట్టేశారు
సీతారామం సినిమా అన్ని కోట్లు వసూలు చేసిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement