మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. నానారకాలుగా హింసిస్తూ చెలరేగిపోయారు. అయినా సరే చెడుపై విజయం సాధించింది. రాక్షసులపై మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఈ క్రమంలో కొందరికి చిన్నపాటి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. అయినా సరే వాటిని లెక్క చేయకుండా టాస్కే మాకు సర్వస్వం అన్న రీతిలో రెచ్చిపోయి మరీ ఆడారు. మరి బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ఈ టాస్కులో ఎవరు బాగా ఆడారు? ఎవరి ఐడియా వర్కవుట్ అయిందో చదివేసేయండి..
రాక్షసుల టీమ్ వాళ్లు నన్ను వదిలేశారు: హారిక
కొంటె రాక్షసులను మంచి మనుషులుగా మార్చేందుకు మరో టాస్క్ ఇచ్చాడు. గుండంలో ఉన్న బస్తాలను బయట పడేసి వారు లోపలే ఉండాల్సి ఉంటుంది. కానీ వాళ్లు బయట పడేసిన ప్రతీసారి రాక్షసులు లోపలకు వేశారు. దీంతో బస్తాలు మరోసారి లోపలకు వేయకుండా మంచి మనుషులు వాటిని స్విమ్మింగ్ పూల్‌లో వేశారు. ఇన్ని చేసినా సరే మంచి మనుషులు ఆ టాస్కులో గెలవలేకపోయారు. ఇక రాక్షసిగా ఉన్న తాను మంచిమనుషులకు ఎలా దొరికిపోయానన్నది హారిక లాస్యతో చెప్పుకొచ్చింది. అరియానా, అవినాష్, మెహబూబ్ తనను వదిలేసి ముగ్గురూ ఒకే వాష్‌రూమ్‌లో దూరిపోయారని చెప్పింది. అందుకు హర్ట్ అయ్యానంది (చదవండి: సోహైల్‌కు హారిక పంటిగాట్లు, ఎవ్వరినీ వదల్లేదు)
ఇంకా టార్చర్ చేయాలనుంది: అరియానా
ఇక తర్వాతి రోజు అరియానా ఇవాళ ఇంకా టార్చర్ చేయాలనిపిస్తుందని మాస్టర్‌తో అంది. తీరా అన్నంతపనే చేసింది. సోహైల్, అఖిల్ షూలను ఎక్కడపడితే అక్కడ విసిరేసింది. పైగా అఖిల్‌తో సారీ చెప్పించుకుంది. ఇక అవినాష్.. లాస్యతో విసనకర్ర విసిరించుకున్నాడు. మొత్తానికి అందరి బట్టలను కింద పడేసి హౌస్‌ను చెత్తకుప్పగా తయారు చేశారు. కళ్ల ముందు జరుగుతున్న ఘోరాలను చూసి లాస్య ఏడ్వలేక నవ్వింది. (చదవండి: అభి, దివికి అహంకారం, మెహబూబ్ వాడుకుంటున్నాడు)
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్.. లాస్య పంచ్
ఆ కోపంలోనే అరియానా, అవినాష్‌లను 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని పంచ్ కూడా వేసింది. కానీ వాళ్లు అందుకు ప్రతీకారంగా ఆమె దుస్తులను కింద పడేశారు. దీంతో ఆమె తన మాటను వెనక్కు తీసుకుని 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని పొగిడింది. అప్పటివరకు రెచ్చిపోయిన అవినాష్ మోనాల్ రాగానే సైలెంట్ అయిపోయాడు. కాసేపటివరకు ఇద్దరు గుసగుసలు పెట్టుకున్నారు. ఆమెను వదిలి రాబుద్ధి కావడం లేదని వాపోయాడు. మరోవైపు సోహైల్ తనంతట తానుగా బట్టలు పడేయకపోతే అందరివీ పారేస్తానని మెహబూబ్ వార్నింగ్ ఇవ్వగా.. టైమ్ బ్యాడ్ అనుకుని చిరాకుతో అప్పటివరకు సర్దుకున్న అన్నింటిని సోహైల్ కింద పడేశాడు.
అరియానాను పూల్‌లో తోసేసిన మాస్టర్
కుండలతో స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు తీసుకుని డ్రమ్ములు నింపాలని మంచి మనుషులకు మరో టాస్క్ ఇచ్చాడు. మెహబూబ్ కుండలకు చిల్లులు పెడుతూ వాటిని పగలగొట్టాడు. దీంతో అభిజిత్ సీరియస్ అయ్యాడు. అయినా సరే మెహబూబ్ డ్రమ్మును బోర్లించగా, అదే సమయంలో అక్కడున్న తనకు దెబ్బ తగిలిందని అఖిల్ గరమయ్యాడు. నీళ్లెలా పోస్తారో చూస్తానన్నట్టు డ్రమ్ముపై కూర్చున్న మెహబూబ్‌ను సోహైల్ ఆ డ్రమ్మును ఎప్పటిలా పెట్టేశాడు. తర్వాత అరియానాను మాస్టర్ స్విమ్మింగ్ పూల్‌లో తోసేశాడు, కానీ తాను తోయలేదని బుకాయించాడు. (చదవండి: కెప్టెన్‌గా నోయల్, కానీ తప్పని ముప్పు)
నువ్వు పెద్ద తోపేం కాదు: అఖిల్
ఇక స్విమ్మింగ్ పూల్‌లో తనను అడ్డుకుంటున్న అవినాష్‌ను మోనాల్ కొరికేసింది. వీళ్లను దాటుకుని టాస్కు గెలవలేమని భావించిన నోయల్ ఓ ఐడియా చెప్పాడు. డ్రమ్ములను స్విమ్మింగ్ పూల్‌లో పడేసి నింపుదామన్నాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అయి వారి విజయానికి కారణమైంది. మరోవైపు టాస్కులో చాలా క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నావని అఖిల్ మెహబూబ్‌ను అన్నాడు. నన్ను ఆపలేక అంటున్నావా? అని అతడు రివర్స్ కౌంటరివ్వడంతో "నువ్వు పెద్ద తోపు, తురుము ఏం కాదు, దమ్ముంటే నా దగ్గరకు రా" అని అఖిల్ సవాలు విసిరాడు. చివరాఖరకు ఈ టాస్కులో మంచి మనుషుల టీమ్ గెలవడంతో అవినాష్‌ను తమలో కలుపుకుపోయారు. (చదవండి: నాన్న ఇస్త్రీ పని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్: నోయల్)
మెహబూబ్‌కు బిగ్‌బాస్ పంచ్
ఒక కొంటె రాక్షసుడిని ఎత్తుకుని ఎండ్ బజర్ మోగేసరికి నేలపై లేకుండా చూసుకోవాలని బిగ్‌బాస్ చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. దీంతో అరియానా అడ్డంగా దొరికిపోయింది. ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుని అరియానాను మంచి మనిషిగా మార్చేశారు. మిగిలిన మెహబూబ్ కూడా వాళ్లలో కలిసిపోయాడు. మంచి మనిషిగా మారిన మెహబూబ్, మైకు ధరించడం కూడా మంచి లక్షణమే అని బిగ్‌బాస్ పంచ్ వేయడంతో ఇంటిసభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. కెప్టెన్ నోయల్ ఈ టాస్కులో బెస్ట్ పర్ఫార్మర్‌గా అరియానా, అవినాష్ పేర్లను వెల్లడించాడు. వీరిద్దరూ కెప్టెన్సీ కోసం పోటీ పడుతారు. మరి రేపటి ఎపిసోడ్‌లో ఎవరు కెప్టెన్ అవనున్నారనేది చూడాలి..
Comments
Please login to add a commentAdd a comment