మొన్న జరిగిన కాయిన్ల టాస్క్ గురించి నాగ్ పంచాయితీ పెట్టారు. ఈ గేమ్‌లో ఎవరెవరికి ఎవరు దోషులుగా అనిపించారనేది గేమ్ ఆడించారు. కాయిన్ల వేటలో విలన్‌గా మారిన సోహైల్, మెహబూబ్‌లను బాగా ఆడారని మెచ్చుకున్నారు. నోరు తెరిస్తే చాలు ఇంగ్లీషు ముక్కలే మాట్లాడుతున్న హారిక, అభిజిత్‌లకు శిక్ష విధించారు. నేటి ఎపిసోడ్‌లో సేఫ్ జోన్ కంటెస్టెంట్లను ప్రకటించకుండా నేరుగా స్వాతి దీక్షిత్‌ను ఎలిమినేట్ చేయడం గమనార్హం. ఊహించని పరిణామానికి ఇంటిసభ్యులు షాక్‌కు లోనయ్యారు. బిగ్‌బాస్ షోలోని నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేసేయండి..
ఇంటి సభ్యులతో దొంగా పోలీసు ఆట
ఎప్పటిలాగే మళ్లీ సుజాత నాగ్‌ను బిట్టు అని పిలుస్తూ, కిలకిలమని నవ్వుతూ ఉండగా షో ప్రారంభమైంది. ఇక ఈ వారం టాస్క్ ఎందుకు ఆడలేదని నాగ్ గంగవ్వను ప్రశ్నించారు. తనకు చేత కావడం లేదని ఆమె చెప్పడంతో తర్వాత నుంచి బాగా ఆడాలని హితవు పలికారు. నోయల్ నేర్పిన తెలుగు ర్యాప్ సాంగ్‌ను మోనాల్ పాడి అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఇంటి సభ్యులతో దొంగా పోలీసు ఆట ఆడించారు. అరియానా.. అమ్మ రాజశేఖర్‌ను దోషిగా నిలబెట్టగా అతడిని మిగతా ఇంటి సభ్యులు నిర్దోషిగా తేల్చి చెప్పారు. సుజాత.. సోహైల్‌ను దోషిగా బోనులో నిలబెట్టింది. కానీ నాగ్ మాత్రం సోహైల్‌కు సపోర్ట్ చేస్తూ, బాగా ఆడావని మెచ్చుకున్నారు. ఇంటి సభ్యులు కూడా అతడిని నిర్దోషిగా ప్రకటించారు. అమ్మ రాజశేఖర్ కూడా సోహైల్‌నే దోషిగా నిలబెట్టగా ప్రతీ ఒక్కరూ అతడు నిర్దోషి అనే ప్రకటించారు రుజువు చేశారు. కుమార్ సాయి.. అమ్మ రాజశేఖర్‌ను దోషిగా అన్నప్పటికీ హౌస్‌మేట్స్ ఆయన్ను అమాయకుడిగా ప్రకటించారు. (చదవండి: బిగ్‌బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ)
హారిక, అభిజిత్‌కు పనిష్మెంట్
ఎప్పుడూ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నందుకు అభిజిత్, హారికకు నాగ్ క్లాస్ పీకారు. రాకపోయినా తెలుగులో మాట్లాడుతున్నావని మోనాల్‌ను మెచ్చుకుంటూనే ఈ ఇద్దరికీ అక్షింతలు వేశారు. ఇంగ్లీషులోనే వాగేస్తున్న అభిజిత్, హారికల వీడియోను నాగ్ ప్లే చేశారు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాని అయోమయంలో పడిపోయిన అభిజిత్ తన ఆలోచనలను తెలుగులో చెప్పడానికి సమయం పడుతుందని, అందుకే ఇంగ్లీషులో మాట్లాడానని తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేశాడు. మీరు మాట్లాడేది చాలామందికి అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేసిన నాగ్ ఈ రోజు ఎపిసోడ్ పూర్తయ్యేంతవరకు వీరిద్దరూ నిల్చునే ఉండాలని శిక్ష విధించారు. అనంతరం సోహైల్.. దివిని దోషని చెప్పగా.. ఆమెను నిర్దోషిగా రుజువు చేశారు. తర్వాత దివి సోహైల్‌నే దోషి అని ప్రకటించింది. అనంతరం అఖిల్.. మాస్టర్‌ను దోషిగా నిలబెట్టగా అందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవినాష్.. దివిని దోషిగా బోనులోకి రమ్మనగా ఆమె బాగా ఆడలేదని అందరూ పెదవి విరిచారు. అనంతరం అరియానా, అవినాష్‌ల సీక్రెట్ వ్యవహారాన్ని నాగ్ బయటపెట్టారు. నువ్వు చాలా కూల్ అని అరియానా గురించి రాశాడని నాగ్ వెల్లడించారు. (చదవండి: నాతో జీవితంలో మాట్లాడకు: అమ్మ రాజశేఖర్)
ట్రయాంగిల్ లవ్ స్టోరీపై చర్చ
లాస్య.. స్వాతిని దోషిగా చెప్పగా నాగ్ కూడా అదే అభిప్రాయాన్ని తెలిపారు. నోయల్ దోషిగా నిలబెట్టిన సుజాతనే మిగతావారందరూ దోషిగా తేల్చారు. మెహబూబ్.. లాస్య సేఫ్ గేమ్ ఆడిందని చెప్పగా అదే నిజమని రుజువైంది. మోనాల్.. అభిజిత్‌ను దోషిగా నిలబెట్టగా అందరూ అవునని చెప్పారు. తర్వాత హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చర్చ మొదలైంది నువ్వంటే ఇష్టం అని మోనాల్.. అభికి చెప్పిన విషయాన్ని దివి బయటపెట్టింది. అఖిల్ పడుకున్నాకే అభి దగ్గరకు వచ్చి మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అభిపై జోకులు వేశామని తెలిపింది. కానీ ఆమె చెప్పిన పాయింట్లకు బాధపడ్డ మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ దీన్ని ట్రయాంగిల్ చేయకండి, తన క్యారెక్టర్ కించపర్చకండంటూ బోరున ఏడ్చేసింది. కాయిన్ల టాస్క్‌లో పాల్గొననందుకు గంగవ్వ, తెలుగు మాట్లాడనందుకు శిక్ష అనుభవిస్తున్న అభి, హారికలకు ఈ గేమ్ ఆడేందుకు చాన్స్ ఇవ్వలేదు. తర్వాత స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో నోయల్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అఖిల్ పడుకున్నాక అభితో మోనాల్ ముచ్చట్లు!
Published Sat, Oct 3 2020 11:02 PM | Last Updated on Sun, Oct 4 2020 12:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment