బుద్ధి బలం ముందు కండబలం ఓడిపోయింది. ఎత్తుకు పై ఎత్తులు, పోట్లాటలు, కొట్లాటల తర్వాత ఎట్టకేలకు రోబోల టీమ్ గెలుపును ముద్దాడింది. దీంతో అప్పటివరకు చేసిన శ్రమ వృథా అయిందే అని మనుషుల టీమ్ ముఖం మాడ్చుకున్నారు. ఇంటి సభ్యులందరూ నోయల్ చెత్తగా ఆడారనడంతో అతడిని బిగ్‌బాస్ చెరసాలలో బందీ చేశాడు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి..
అవినాష్ నమ్మకద్రోహి: మాస్టర్
రోబోల టీమ్‌లోని అవినాష్ మాస్టర్‌కు తెలీకుండానే అతని దగ్గరి నుంచి చార్జింగ్ పెట్టేసుకున్నాడు. అది గమనించిన దివి అవినాష్‌ను రెండు తగిలించింది. నమ్మకద్రోహంతో బాగా హర్ట్ అయిన మాస్టర్ లైఫ్‌లో, జన్మజన్మలో తనతో మాట్లాడకంటూ అవినాష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. లైఫ్‌లో నాశనం అయిపోతావ్ అని శాపనార్థాలు పెట్టాడు. దీంతో మాస్టర్‌ను కూల్ చేసేందుకు అవినాష్ నానా తంటాలు పడ్డాడు. తర్వాత అవ్వ రోబో డ్రెస్‌ను తీసి విసిరేసినందుకు మోనాల్‌పై కుర్చీ ఎత్తి విసిరేసింది. మరోవైపు వాష్‌రూమ్ ఆపుకోలేకపోయిన మనుషులు రోబోలకు ఎలాంటి చార్జింగ్ ఇవ్వకుండానే వాష్‌రూమ్ వాడేసుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో తలనొప్పిగా మారుతోన్న గంగవ్వ!)
బతికిన రెండు రోబోలు, గెలుపు డిక్లేర్
దీంతో అడ్డు వెళ్లబోయిన అరియానాను మోనాల్ ఈడ్చి పారేసింది. లాస్యను వెనక్కు నెట్టే క్రమంలో ఇద్దరూ కిందకు పడిపోయారు.ఆహారం ఇస్తే చార్జ్ ఇస్తామని గంగవ్వతో బేరం కుదుర్చుకున్నారు. కానీ ఎలాంటి చార్జింగ్ లేకపోవడంతో రోబోలు అరియానా, కుమార్ సాయి, అవినాష్, హారిక, లాస్యలు చచ్చిపోయారు. బజర్ మోగే సమయానికి అభి, గంగవ్వ లు బతికే ఉండటంతో రోబో టీమ్ గెలుపు సాధించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో సంతోషం పట్టలేక రోబో టీమ్ ఎగరి గంతేసింది. కానీ ఈ టాస్క్‌లో జరిగిన పరిణామాల నుంచి మనుషులు బయట పడలేదు.
కెప్టెన్సీ పోటీకి ఆ నలుగురు
రోబోల టీమ్‌లోని వాళ్లు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని నోయల్ మోనాల్‌తో చెప్పుకొచ్చాడు. అభితో మాట్లాడేందుకు ప్రయత్నించినా మధ్యలో హారిక వస్తుందని మోనాల్ బాధపడింది. అభిని హారిక కంట్రోల్ చేస్తుందని మాస్టర్ అభిప్రాయపడ్డాడు. టాస్క్‌లో జరిగిన రభసకో ఏమో కానీ అభి తనకు ఉండాలనిపించడం లేదని హారికతో ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు. ఇక గెలిచిన టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ, హారిక, అభిజిత్ కెప్టెన్ పోటీలో నిలబడ్డారు. అయితే మూడో కెప్టెన్‌గా గంగవ్వే సెలక్ట్ అయిందని లీకువీరులు చెప్తున్నారు. ఇక ఇంటి సభ్యులందరూ కలిసి ఓడిపోయిన టీమ్‌లో నోయల్ చెత్త పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడని తెలపడంతో అతడు జైల్లోకి వెళ్లాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. (చదవండి: వర్కవుట్ అయిన కిడ్నాప్; నాకిది అగ్ని పరీక్ష)
నోయల్‌కు రోజంతా రాగి జావ మాత్రమే
అతడికి తిండీ, టీ, కాఫీలు, జ్యూస్‌లు ఇవ్వకూడదని శిక్ష విధించాడు. కేవలం రాగి జావ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. జావకు అవసరమయ్యే రాగులను కూడా అతడే పిండి చేయాల్సి ఉంటుందని తెలిపాడు. తర్వాత చెరసాలలో నుంచే నోయల్ ర్యాప్ పాడాడు. దివి పాట పాడితే మాస్టర్ స్టెప్పులేశాడు. ఇక రేపటి ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. అంటే హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఇంట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో రేపు చూడాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్: త్వరలో హీరోయిన్ ఎంట్రీ!)
Comments
Please login to add a commentAdd a comment