సింగర్, ‘బిగ్‌బాస్’ఫేమ్ నోయల్ రెండు రోజుల క్రితం ‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను’అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఎగ్జైట్ న్యూస్ అని చెప్పడంతో అది కచ్చితంగా పెళ్లి గురించి అయి ఉంటుందని నెటిజన్లు భావించారు. అయితే నోయల్ తాజాగా అసలు విషయాన్ని చెప్పాడు.
తన జీవితంలోని కొత్త ఆరంభం గురించి ప్రకటించేశారు. తాను హీరోగా రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్‌ను ఇస్తూ ఫస్ట్‌లుక్‌ని రివీల్ చేశాడు. మనీషి అనే సినిమాతో హీరోగా నోయల్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. పూజిత పొన్నాడ హీరోయిన్‌గా రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. స్పార్క్ ఓటీటీలో ఈ మూవీ జూన్ 18 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి వినోద్ నాగుల దర్శకత్వం వహించగా.. సత్యనారాయణ నాగుల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Here's the First Look of my upcoming movie #MoneyShe🎭
— Noel (@mrnoelsean) June 9, 2021
Very happy to share that it's
Releasing Exclusively in @sparkottin on June 18th! 📝
Thank you @VinodNagula bhayya & team for making me a part this project!#మనిషి @pujita_ponnada pic.twitter.com/Uphoij6mEZ
చదవండి:
PSPK28: ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్.. స్పందించిన నిర్మాణ సంస్థ
సమంతకు కొడుకుగా నటించేది ఈ స్టార్ హీరో తనయుడే!
Comments
Please login to add a commentAdd a comment