బిగ్‌బాస్ హౌస్‌లో అంతో ఇంతో కాస్త అందరికీ తెలిసిన వ్యక్తి నోయల్ సేన్. సింగర్, నటుడు అయిన ఇతనికి సోషల్ మీడియాలో చాలామందే అభిమానులు ఉన్నారు. హౌస్‌లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే చాలా తెలివిగా ఆడుతూ అందరితో కలిసిపోతున్నాడు. అలాగే గ్యాంగ్ లీడర్ అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే నిన్నటి కట్టప్ప ఎపిసోడ్ నోయల్‌కు వెన్నుపోటు పొడిచిందంటున్నారు నెటిజన్లు. ఈ టాస్క్‌లో నోయల్ కాస్త అతి చేశాడని అంటున్నారు. చీప్‌గా సింపతీ కార్డ్ ప్లే చేశాడని విమర్శిస్తున్నారు. (వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?)
అసలేంటి కట్టప్ప ఎపిసోడ్
బిగ్‌బాస్.. మీలో ఒకరు కట్టప్ప ఉన్నారని చెప్పగానే కంటెస్టెంట్లు అందరూ భయపడిపోయారు. ప్రతి ఒక్కరినీ అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. బిగ్‌బాస్ మొదటి వారం మొత్తం ఈ కట్టప్ప చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే కట్టప్ప ఎవరో కనుక్కునేందుకు రెండు టాస్క్‌లు ఆడించాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్‌లో ముచ్చటగా మూడోసారి కూడా కట్టప్ప గురించే టాస్క్ నడిచింది. కట్టప్ప అని ఎవరిమీదైతే అనుమానం ఉందో వారిపై స్టాంప్ వేయమని ఆదేశించాడు. ఇంటి సభ్యులు కూడా అలానే చేశారు. కానీ నోయల్ వంతు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. కట్టప్ప అంటే అందరినీ నమ్మకంగా కాపాడుకునే వ్యక్తి అని భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు. (బిగ్‌బాస్: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు)
🤣🤣🤣🤣🤣🤣#Noel#BiggBossTelugu4 pic.twitter.com/MevnpueRXG
— నందమూరి_అభిమాని (@p_jit26) September 12, 2020
అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తున్న నోయల్ వ్యాఖ్యలతో అటు ఇంటిసభ్యులతోపాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ అంతలోనే అనవసరమైన ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చేశాడు. "కట్టప్ప అని ముద్ర వేస్తే టీవీలో చూసే మీ ఇంటి సభ్యులు బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే నాకు నేనే ముద్ర వేసుకుంటాను" అని మాట్లాడాడు. అయితే ఎవరికి వారు ముద్ర వేసుకోవడం కుదరదని బిగ్‌బాస్ తేల్చి చెప్పాడు. దీంతో తనకు అమ్మ రాజశేఖర్‌తో చనువు ఉంది కాబట్టి, ఆయనకే వేస్తాను, మిగతా వారికి వేస్తే ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో నోయల్‌పై నెగెటివిటీ పెరిగింది. సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరైతే "మొన్నటివరకు నోయల్ అంటే ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు వేరే హౌస్‌మేట్స్‌ను వెతుక్కుంటాం" అంటున్నారు. (ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్..)
Comments
Please login to add a commentAdd a comment