బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ లేటెస్ట్ మూవీ '14'. ఇందులో ఇతడు డిటెక్టివ్ పాత‍్ర పోషించాడు. రామ్ రతన్ రెడ్డి, విషాక ధీమాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. పోసాని కూడా కీ రోల్ చేశారు. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
రతన్ (రామ్ రతన్ రెడ్డి).. ముఖ్యమంత్రి (పోసాని కృష్ణ మురళి) కుమారుడు. ఇతడిది జాలీ లైఫ్. నేహా (విషాక ధీమాన్) అనే డాక్టర్‌తో ప్రేమలో ఉంటాడు. ఉన్నట్టుండి ఓరోజు.. నేహా ఫ్లాట్‌లో వీళ్లిద్దరూ విగత జీవులుగా కనిపిస్తారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి పోలీసులు.. కేస్ మూసేస్తారు. జర్నలిస్ట్ సుబ్బు(శ్రీకాంత్ అయ్యంగార్) మాత్రం వీరిది ఆత్మహత్య కాదని, హత్య అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇంతకీ సుబ్బు ఏం కనుక్కొన్నాడు. ఈ చావులో సీఎం పాత్ర ఏంటి? డిటెక్టివ్ నోయల్ ఈ కేస్ స్టడీలో ఎంత వరకూ ఉపయోగపడ్డాడు? అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)
ఎలా ఉందంటే?
మొదట్లో ఓ సాధారణ మర్డర్ మిస్టరీలాగ సినిమా ప్రారంభించారు. ఆ తరువాత ఇంట్రెస్టింగ్ మలుపులతో స్క్రీన్ ప్లే నడిపించారు. మధ్యలో యూత్‌ని ఎంటర్ టైన్ చేయడం కోసం రొమాంటిక్ సీన్స్ పెట్టారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్టులతో ఆకట్టుకున్నారు. 14 ఏళ్ల యువకుల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? వారు టెక్నాలజీలో పడి ఎలాంటి వాటికి బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు తదితర విషయాలను ప్రీ క్లైమాక్స్ నుంచి బాగా చూపించి... తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చారు. పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయకూడదో... అలా చేయడం వల్ల వారు ఎలాంటి క్షణికావేశాలకు లోనవుతారనేది ఇందులో చూపించారు.
ఎవరెలా చేశారు?
నోయల్ డిటెక్టివ్‌గా... ప్రీ క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటారు. లీడ్ రోల్స్ చేసిన రతన్, విషాక పర్లేదు. రొమాంటిక్స్ సీన్లలో బాగానే చేశారు. పోసాని కృష్ణ మురళి పాత్ర ఓకే. జబర్దస్త్ మహేష్ పాత్ర కాసేపు ఉన్నా... తన మార్క్ సంభాషణలతో ఆకట్టుకుంటారు. జర్నలిస్ట్ సుబ్బు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ రాసుకున్న కథ... కథనాలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తీసినప్పటికీ.. చివర్లో ఓ మంచి మెసేజ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫ, సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment