'లవ్ మాక్‍‌టైల్ 2' సినిమా రివ్యూ | Love Mocktail 2 Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Love Mocktail 2 Review: 'లవ్ మాక్‍‌టైల్ 2' రివ్యూ

Published Fri, Jun 14 2024 7:15 PM | Last Updated on Fri, Jun 14 2024 8:18 PM

Love Mocktail 2 Movie Review And Rating In Telugu

2022లో కన్నడలో రిలీజై హిట్ కొట్టిన సినిమా 'లవ్ మాక్‌టైల్ 2'. హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా చేశాడు డార్లింగ్ కృష్ణ. అతడి భార్య మిలాన్ నాగరాజ్ హీరోయిన్. తాజాగా దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథేంటి?
'లవ్ మాక్‌టైల్'కి సినిమాకు ఇది సీక్వెల్. ఆది (డార్లింగ్ కృష్ణ) భార్య నిధి (మిలినా నాగరాజ్) చనిపోతుంది. ఎప్పుడూ తన భార్య ఆలోచనలతోనే ఉండే ఆది.. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం అరకు వెళ్తాడు. ఆ ప్రయాణంలో తన భార్య తనతోనే ఉందని ఊహించుకుంటూ ఉంటాడు. తనను ఇష్టపడే అమ్మాయిలు తన వెంట పడుతున్న వారిని పట్టించుకోడు. కానీ తన భార్య.. తనని ఊహించుకుంటున్న హీరోకి పెళ్లి చేయాలని చూస్తుంది. చివరికి హీరో ఇంకో పెళ్లి చేసుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)

ఎవరెలా చేశారంటే?
'లవ్ మాక్‌టైల్' సినిమాతో హిట్ కొట్టిన డార్లింగ్ కృష్ణ తనే నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌ చాలా బాగా చేశాడు. నిధి క్యారెక్టర్‌లో మిలాన నాగరాజ్ నటన చాలా బాగుంది. రచల్ డేవిడ్, నకుల అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్ ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు. నకుల్ నకుల అభయాన్కర్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ పాటలు సినిమాకి హైలైట్. శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. మంచి కథ నేర్చుకుని దర్శకత్వ విలువలతో డార్లింగ్ కృష్ణ ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ని తీసుకుని వచ్చారు.

డార్లింగ్ కృష్ణ తీసుకున్న స్టోరీతో పాటు అతడి యాక్టింగ్ బాగుంది. మిలాన నాగరాజ్, అభిలాష్, రచల్ డేవిడ్ పాత్రలు కూడా స్టోరీకి తగ్గట్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ సినిమాకి కీలకంగా నిలిచింది. అయితే ఫస్టాప్‌లో కొన్ని సాగదీతగా అనిపించిన సీన్స్, అలానే కొన్ని కామెడీ సీన్స్ మైనస్‌గా నిలిచాయి.

(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement