తెలుగులో ఇప్పుడంతా కంటెంట్ ఉన్న సినిమాలదే హవా నడుస్తోంది. స్టార్ హీరోలు లేకపోయినా మూవీస్ సూపర్ హిట్ అవుతున్నాయి. అలా బోలెడన్ని చిన్న చిత్రాలు ప్రతివారం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'సీతారాం సిత్రాలు'. కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)
కథేంటి?
కర్నూలు దగ్గరల్లో టీ స్టాల్ నడిపే కుర్రాడు శివ (లక్ష్మణమూర్తి). మంచి మాటలని వాట్సప్‌లో పెడుతూ 'స్టేటస్ శివ'గా ఫేమస్ అవుతాడు. జీవితంలో సక్సెస్ అవ్వాలనేది గోల్. ఓసారి టీచర్‌గా పనిచేసే పార్వతి( భ్రమరాంబిక)తో ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఆమెతోనే పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని భారీగా అప్పు చేసి ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ ఊహించని విధంగా పెళ్లి ఆగిపోయి, అప్పులు మిగులుతాయి. ఇంతలో విలన్ ఎంట్రీ ఇస్తాడు. దాంతో శివ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
ఇది చిన్న సినిమానే గానీ ఎన్నో విషయాలను దర్శకుడు ఇందులో చూపించాడు. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే విజయం వరిస్తుందని... బంధువులు మాటలు చెప్పడానికే కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు పనికిరారనే జీవిత సత్యాన్ని చూపించారు. స్నేహితులు కూడా మనల్ని నమ్మించి ఎలా మోసం చేస్తారో చూపించే సీన్లు బాగున్నాయి. సీరియల్స్ మాయలో పడి ఆడవాళ్లు, ఇంట్లో వాళ్లని కూడా అందులోని పాత్రలుగా ఊహించుకోవడం ఎలా ఉంటుందో చూపించాడు.
(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)
ఎంచుకున్న పాయింట్‌ని చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. ముఖ్య పాత్రల్లో తెలిసిన వాళ్లను తీసుకుని ఉంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది. ప్రస్తుతం యువత ప్రేమలో ఓడిపోతే కుంగిపోతున్నారు. అలాంటి వాళ్లు ఎలా సక్సెస్ అవ్వొచ్చో ఈ మూవీతో చూపించారు.
హీరో లక్ష్మణ మూర్తి, హీరోయిన్ భ్రమరాంబిక తమ పాత్రలకు న్యాయం చేశారు. తల్లిగా చేసిన ఢిల్లీ రాజేశ్వరితో పాటు మిగిలిన నటీనటులు పర్లేదనిపించారు. దర్శకుడిగా చెప్పాలనుకున్న పాయింట్‌ని సూటిగా చెప్పాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. రుద్ర కిరణ్ సంగీతం వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment